కన్నతల్లిపై కొడుకు రాక్షసత్వం,బతికుండగానే….  

Son Pouring Kerosene Mother - Telugu Mother, Nalgonda, Son, Son Killed Mother By Pouring Kerosene In Nalgonda District

పేగు తెంచుకు పుట్టిన కన్న బిడ్డపై తల్లికి ఎంత మమకారం ఉంటుందో చెప్పలేం.కన్న తల్లి ప్రేమను ఎవరూ వెలకట్టలేరు.

 Son Pouring Kerosene Mother

అలాంటి తల్లి ని ప్రేమించలేని ఒక కన్న కొడుకు రాక్షుసుడిగా ప్రవర్తించిన తీరు అందరినీ కంటనీరు తెప్పించింది.తల్లిని సాకలేక బతికుండగానే నిప్పంటించి సజీవ దహనం చేశాడు.

లేవలేని స్థితిలో కొడుకు చేసిన పనికి మూగరోధనతో ఆ తల్లి ప్రాణాలు వదలింది.నల్లగొండ జిల్లా నర్సింగ్‌బట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

కన్నతల్లిపై కొడుకు రాక్షసత్వం,బతికుండగానే….-General-Telugu-Telugu Tollywood Photo Image

అనారోగ్యంతో ఉన్న తల్లి పోషణ భరించలేక ఆ కన్న కొడుకు ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు.

తిరుమల శాంతమ్మ(55) అనే మహిళ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.

ఆమె కొడుకు లింగస్వామి హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ ఉన్నాడు.ఈ క్రమంలో తల్లి పోషణ చూసుకోవడం భారంగా మారింది.

ఆమెకు సపర్యలు చేయలేక ఎలాగైనా వదిలించుకోవాలని అనుకున్నాడు.పది రోజుల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు.

మంగళవారం రాత్రి శాంతమ్మ నిద్రపోతున్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించడం తో ఆ కన్న తల్లి అగ్నికి ఆహుతైపోయింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే కన్న తల్లిని ఇంత కర్కశంగా సజీవదహనం చేయడం తో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా మానవసంబంధాలు మాత్రం మంటగలిసిపోతున్నాయి.

అమ్మ,నాన్న,అక్క,తమ్ముడు,అన్న,చెల్లి వంటి వరుసలు కూడా మర్చిపోయి జనాలు ప్రవర్తిస్తున్న తీరు కలవరం కలిగిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test