సుప్రీం కోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు కుమారుడు.. !

ఒకప్పుడు ఏపీలో ఫ్యాక్షనిస్టులతో భయం ఉండేది.ఒకగానొక సమయంలో ఈ ఫ్యాక్షనిజం వల్ల వేల కుటుంబాలు రోడ్దున పడ్ద వార్తలు మరవలేం.

 Son Of Raghuram Krishnaraja Appeals To Supreme-TeluguStop.com

అలాంటిది ఫ్యాక్షనిస్టుల కల్చర్‌కు శుభం కార్డు పడిందని ప్రజలంతా హాయిగా జీవిస్తున్న సమయంలో రాజకీయ కక్షలు మొదలైయ్యాయి.ఇవి ఫ్యాక్షనిజానికేం తక్కువ కాకుండా పోటాపొటీగా సాగుతున్నాయి.

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ కుటుంబంతో సహా, వీరి అనుచరులను, పార్టీ నేతలను టార్గెట్ చేశారు.ఇక ఆ శకం ముగిసింది అనుకునే లోపలే వైసీపీ అధికారంలోకి రావడం, మళ్లీ చరిత్ర పునరావృతం కావడం జరుగుతుంది.

 Son Of Raghuram Krishnaraja Appeals To Supreme-సుప్రీం కోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు కుమారుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఒకరి పై ఒకరు కేసులు, అవినీతి ఆరోపణలతో ఏపీ రాజకీయాలు విజయవంతంగా సాగుతున్నాయి.

ఈ నేపధ్యంలో ఒక్కసారిగా ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీలో అలజడి రేపింది.ఈ కేసు ఇప్పటి వరకు ఎన్నో మలుపులు తిరుగుతుంది.ఇకపోతే రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మొత్తం ఈ వ్యవహారంపై సిట్ తో దర్యాప్తు జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇక ఈ కేసులో ప్రతి వాదులుగా రాష్ట్ర, కేంద్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిలతో పాటుగా సీఎం జగన్, మంగళగిరి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్, సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్ కుమార్ మొదలగు వీరిని పేర్కొన్నారు.

కాగా జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను ఈరోజు విచారణ జరపనుందని సమాచారం.

#YCP MP #Supreme Court #Files Petition

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు