భాజపాకు దొరికింది ఒక పడవ

బీహార్లో భాజపాకు ఒక పడవ దొరికింది.పడవ దొరకడం ఏమిటి? భాజపా నాయకులు నదిని దాటాలా? సముద్రం దాటాలా? దాటాలి.కాని అది నది కాదు.సముద్రం కాదు.ఎన్నికల సముద్రం.అది దాటి విజయం అనే ఒడ్డుకు చేరుకోవాలంటే పెద్ద ఓడతో పాటు చిన్న పడవలు కూడా అవసరమే.

 ‘son Of Mallah’ Casts New Vote In Bihar-TeluguStop.com

ఈ ఓడలు, పడవలు కులాలు, సామాజిక వర్గాలు.వాటిని ఎక్కితే ఓట్లు పడతాయి.

ప్రస్తుతం పడవలు నడిపే సామాజిక వర్గం అండ భాజపాకు దొరికింది.ఈ సామాజిక వర్గాన్ని మల్లా కులంగా పిలుస్తారు.

నిషాదులు అనే సామాజిక వర్గంలో మల్లా ఉప కులం.వీరి ప్రధాన జీవనోపాధి పడవలు నడపడం.

ఈ వర్గానికి చెందిన ముకేష్ సాహ్ని అనే 34 ఏళ్ల యువ నేత భాజపాకు మద్దతు ఇస్తున్నాడు.మొన్నటి వరకు ముఖ్యమంత్రి నితీష్ పక్కన వున్నా ముకేష్ను భాజపా బుట్టలో వేసింది.

ఇతను సినిమా నిర్మాతే కాకుండా వ్యాపారవేత్త కూడా.ఇతను భాజపాను సపోర్టు చేస్తూ పత్రికల్లో పూర్తీ పేజీల ప్రకటనలు ఇచ్చాడు.

బీహార్లో పెద్ద యుద్ధం జరగబోతున్నదని, ఇందులో ఎన్డీయేను గెలిపించాలని ప్రజలను ముకేష్ కోరాడు.ఎన్నికల్లో ప్రజలు లాలూ ప్రసాద్కు, నితీష్ కుమార్కు సాగిన జవాబు ఇస్తారని ముకేష్ అన్నాడు.

ఈయన కేవలం 20 రోజుల కిందటే నితీష్కు అనుకూలంగా మాట్లాడాడు.కాని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఈయన మైండ్సెట్ మార్చివేశాడు.

బీహార్లో మల్లా సామాజిక వర్గం ఈబీసీ కేటగిరిలోకి వస్తుంది.ఈ కులం వారు జనాభాలో 5 శాతం ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube