మద్యం మత్తులో బైక్ నడిపి తల్లి ఊపిరి తీసిన తనయుడు.. ?

మద్యంతాగి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా వినే వారు ఎవరు.తాగి వాహనం నడుపుతుండగా పట్టుబడితే చలానాలు అయిన కడుతున్నారు గానీ ఈ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు.

 Son Killed By Mother Under The Influence Of Alcohol-TeluguStop.com

ఇకపోతే మద్యం మత్తులో బైక్ నడిపిన ఓ వ్యక్తి కన్న తల్లి ఆయువును కాలరాసాడు.తాగిన మత్తులో ఈ ప్రమాదానికి కారణం అయ్యాడు.

ఆ వివరాలు తెలుసుకుంటే.

 Son Killed By Mother Under The Influence Of Alcohol-మద్యం మత్తులో బైక్ నడిపి తల్లి ఊపిరి తీసిన తనయుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన రాజవ్వ అనే(65) సంవత్సరాల మహిళ తన కొడుకుతో కలిసి దగ్గర బంధువుల దశదిన కర్మ కు హజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది.

బంధువుల ఇంటి నుండి తన కొడుకు బైక్ పై వెళ్తుండగా ధర్మసాగర్ మండలంలోని సెంట్ అంతోని స్కూల్ ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆటో కు ఢీ కొనడంతో బైక్ పై నుండి కింద పడిన రాజవ్వ అక్కడికక్కడే మృతి చెందింది.కాగా మృతురాలి కుమారుడు మద్యం సేవించి ఉన్నాడని సమాచారం.

ఇకపోతే ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇక పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

#Mother #Karimnagar #Son Killed #Alcohol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు