ఆ వీడియోలు డిలీట్ చేసారని.. తల్లిదండ్రుల పైన కేసు పెట్టిన కొడుకు...అసలు విషయం ఇదే..  

Son Filed A Case On Parents-

ఈ మధ్య ఎక్కువ మంది మగవారు అస్లీల వీడియోలు చూడటానికి అలవాటు పడ్డారు , అది వారిలో ఉన్న వింత చేష్టలను బయటకి రప్పిస్తుంది. పోర్న్ ఎక్కువగా చూస్తున్నాడని భార్య విడకూలిచ్చినప్పటికి అతను మాత్రం పోర్న్ ని చూడటం ఆపలేదు. దీనితో అతను ఇంట్లో లేని సమయం లో తల్లిదండ్రులు చేసిన ఆ పని కి ఏకంగా వారి పైనే కేసు పెట్టాడు ఆ కుమారుడు..

ఆ వీడియోలు డిలీట్ చేసారని.. తల్లిదండ్రుల పైన కేసు పెట్టిన కొడుకు...అసలు విషయం ఇదే..-Son Filed A Case On Parents

ఇప్పుడు ఈ విషయం అమెరికా లో వైరల్ అయిపోతుంది. అసలు విషయం ఏంటంటే.

అమెరికాలో ఇండియానా లో నివసిస్తున్న చార్లీ కొన్ని సంవత్సరాల క్రితం ఒకమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వారి బంధం ఎక్కువ కాలం నిలవలేదు కారణం తన భర్త ఎక్కువగా అస్లీల వీడియోలు చూడటానికి అలవాటు పడటం. చార్లీ కి చాలా కాలం నుండి అస్లీల వీడియోలు చూడటం అలవాటు అస్లీల వీడియోల కోసం ఏకంగా 30వేల డాలర్ల ని ఖర్చు చేసాడట అంటే మన దేశ కరెన్సీ లో 20 లక్షల రూపాయలు . దీనితో చార్లీకి తన భార్య ఎన్నో సార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నించిన అతను వినకపోయే సరికి ఆమె అతనికి విడాకులు ఇచ్చేసింది.

భార్య తో విడాకులు తీసుకున్నాక చార్లీ తన తల్లిదండ్రుల తో కలిసి ఉంటున్నాడు. చార్లీని ఎప్పుడు చూసినా తను లాప్ టాప్ ముందు కూర్చునేవాడు. దానిని గమనించిన తల్లిదండ్రులు చార్లీ లేని సమయం లో తన రూం కి వెళ్లి చూడగా అక్కడ కొన్ని వందల అస్లీల వీడియో సీడీ లతో పాటు అతని లాప్ టాప్ లో ఎక్కువ మొత్తం లో అస్లీల వీడియోలు ఉన్నాయి. అది చూసిన తల్లిదండ్రులు షాక్ కి గురి అయ్యారు వెంటనే వాటన్నిటిని లాప్ టాప్ నుండి డిలీట్ చేసి అస్లీల వీడియో సీడీ లను ధ్వంసం చేశారు.

రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి తన లాప్ టాప్ లో ఉన్న వీడియోలతో పాటు దాచుకున్న సీడీ లు కనిపించలేదు. ఎంతో కష్టపడి, ఖర్చు పెట్టిన సేకరించిన కలెక్షన్స్ ధ్వంసం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన చార్లీ వాటిని ధ్వంసం చేసిన తల్లిదండ్రులపై కోర్టులో దావా వేశాడు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 86 వేల డాలర్లు (దాదాపు 60 లక్షల రూపాయలు) చెల్లించాలంటూ కోరాడు. చార్లీ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి…