లైవ్ ఇంట‌ర్వ్యూలో కొడుకు డ్యాన్స్‌.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన యాంక‌ర్‌

Son Dance In Live Interview The Anchor Smiling

ఒక‌ప్పుడు అంటే క‌రోనాకు ముందు టీవీ ఇంట‌ర్వ్యూలు అన్నీ కూడా ఆయా ఆఫీసుల్లోనే జ‌రిగేవి.కానీ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత సీన్ మారిపోయింది.

 Son Dance In Live Interview The Anchor Smiling-TeluguStop.com

ప‌నిచేసే విధానం ద‌గ్గ‌రి నుంచి ఇంట‌ర్వ్యూలు తీసుకునే విధానం వ‌ర‌కు అంతా ఆన్‌లైన్ వ్య‌వ‌హారాలు వ‌చ్చాయి.ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతున్నా స‌రే చాలా సంస్థలు తమ ద‌గ్గ‌ర ప‌నిచేసే ఉద్యోగులకు వర్క ఫ్రమ్ హోమ్ అలార్ట్ చేస్తున్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

దీన్ని బ‌ట్టే క‌రోనా భ‌యం ఇంకా పోలేద‌న్న విష‌యం అంద‌రికీ అర్థం అవుతోంది.

 Son Dance In Live Interview The Anchor Smiling-లైవ్ ఇంట‌ర్వ్యూలో కొడుకు డ్యాన్స్‌.. ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన యాంక‌ర్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంకోవైపు విద్యాసంస్థలు, కాలేజీలు కూడా విద్యార్థ‌లుకు ఆన్ లైన్ క్లాసులే నిర్వ‌హిస్తున్నాయి.

అయితే వీటి వ‌ర‌కు ఎలాంటి ఇబ్బందులు లేక‌పోయినా కూడా ఆఫీసుల‌కు ప‌నిచేసే వారికే నిత్యం ఇంటి ద‌గ్గ‌రి నుంచి ఏదైనా ఇంట‌ర్వ్యూలు ఇవ్వాలంటే పెద్ద స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి.ఈ నేప‌థ్యంలో చాలా ఫ‌న్నీ వీడియోలు నెట్టింట చెక్క‌ర్లు కొడుతున్నాయి.

ఇందులో బాస్ ఇంట‌ర్వ్యూ చేస్తుండ‌గా అత‌ని భార్య మ‌ధ్య‌లో వ‌చ్చి ఏదో ఫ‌న్నీ మూమెంట్ చేయ‌డం లాంటివి చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ ఫ‌న్నీ వీడియో గురించే చెప్పుకోబోతున్నాం.

ఈ మ‌ధ్య ఛాన‌ళ్లె కూడా ప్ర‌ముఖుల‌ను ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూలు చేస్తున్న విష‌యాలు మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు మ‌నం చూస్తున్న వీడియోలో కూడా ఓ టీవీ యాంక‌ర్ ఒక ప్ర‌ముఖుడిని ఇంట‌ర్వ్యూ చేస్తుండ‌గా అత‌ని కొడుకు వెనక నిలబడి యాంక‌ర్‌కు హాయ్ చెప్తాడు.అయితే తండ్రి అత‌న్ని ప‌క్క‌కు పంపించ‌గా కొద్ది సేప‌టికి ఆ కుర్రాడు మ‌ళ్లీ వ‌చ్చి డ్యాన్స్ చేయ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.ఇది చూసిన ఆ యాంక‌ర్ చిరునవ్వులు చిందించడం కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.

దీన్ని చూసిన వారంతా కూడా ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

#Live Interview #Anchor #Tv Anchor #Interview

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube