ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు జగన్ సర్కార్ పై ఆరోపణలు చేశాడు.ఏపీ రాజధానిగా అమరావతి కి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.
అలాగే జగన్ మాత్రం మూడు రాజధానుల వలనే అభివృద్ది సాధ్యం అవ్వుతుందనే విషయాని తెరపైకి తేవడంతో అమరావతి ప్రాంత రైతులు, వ్యాపారులు ధర్నాలు రాస్తారోకులతో ఏపీ అట్టుడుకుతుంది.బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి కేంద్ర కార్యాలయాని త్వరలో ఏర్పాటు చేస్తాం అని అన్నారు.
చంద్రబాబు, జగన్ ఇద్దరి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పులో కూరుకుపోయింది.మన ప్రధాని నరేంద్ర మోడి ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ నేపధ్యంలోనే జగన్ 30 లక్షలు ఇల్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నాడు.అసలు నిజం ఏమిటి అంటే 15 లక్షల ఇల్లు మన ప్రధాని నరేంద్ర మోడి గారు ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఇస్తున్నవే అన్నారు.
ఏపీ లో రోడ్ల పరిస్తితి దారుణంగా ఉంది.ఈ విషయంపై త్వరలో రాస్తారోకు చేసి తీరుతాం.
బిజేపి నాయకులు కార్యకర్తలు అందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.