నా టార్గెట్ బాబే అంటున్న “సోము” నెక్స్ట్ స్టెప్ ఇదే   Somu Veerraju Targets Chandrababu Naidu     2018-01-29   23:51:31  IST  Bhanu C

ఏపీలో యాత్రా కాలం మొదలయ్యింది జగన్ తో మొదలు పెట్టిన యాత్ర మెల్లగా పవన్ కళ్యాణ్ వైపుగా సాగి అటునించి అటు సోము వీర్రాజు వైపుగా వెళ్తోంది..అసలు ఈ యాత్రలు ఎందుకు చేయాలి అంటే ప్రజలని మభ్యపెట్టడానికా లేక ప్రజా సంక్షేమం కోసమా..? అనుకుంటే ఎవరి స్వార్థం వారిదే ప్రజా సంక్షేమం ఎక్కడ ఉంది అంటున్నారు ప్రజలు..సరే అసలు విషయానికి వస్తే.

మొన్నటికి మొన్న చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చి బీజేపి వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ మీకు దణ్ణం పెట్టి తప్పుకుంటాం అని అన్నారు..అప్పటి వరకూ మాత్రా ధర్మం అన్న బాబు ఒక్కసారిగా బీజేపి ని దూరం పెడుతూ మాట్లడటం ఎంతో షాక్ ఇచ్చింది టిడిపి నేతలకి సైతం..

అయితే..ఏపీలో టిడిపి బీజేపి ని ఎలా దెబ్బతిస్తోందో..ఎలాంటి వ్యూహాలు అమలు చేయడానికి సిద్దంగా ఉందొ తెలియచేయడానికి తమ బీజేపి క్యాడర్ కి తెలియచెప్పడానికి సోము వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే..

ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు..ఎమ్యెల్సీ సోము వీర్రాజు అమరావతి, రాజమండ్రి, విజయనగరాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌ర్య‌ట‌నలో టీడీపీ మిత్ర ధ‌ర్మం, పార్టీపై కేడ‌ర్ కు ఉన్న అపోహ‌లు, టీడీపీ – బీజేపీ మిత్రబంధం వాజపేయి హయాంలో ఎలా ఉంది..పీఎం మోడీ వచ్చాక ఎలా ఉంది ..అనే అంశాలని వివరించడానికి “సోము” రంగంలోకి దిగుతున్నారు అని టాక్..

అయితే టిడిపి నేతలు మాత్రం ఎంతో జాగ్రత్తగా బీజేపి విషయంలో వ్యవహరిస్తున్నారు నోరుజారే బ‌దులు డిఫెన్స్ రాజ‌కీయాలకు ప్రాధాన్య‌మిస్తే 2019 ఎన్నిక‌ల్లో స్వామికార్యం… స్వకార్యం ఇలా రెండింటిని తీర్చుకోవ‌చ్చ‌నే భావ‌న‌లో ఉన్నార‌ట ఏపీ టీడీపీ నేత‌లు…అంటే అటు డిఫెన్స్ చేస్తున్న‌ట్లు చేస్తూ ఓ వైపు పార్ల‌మెంట్ కేంద్రంగా టీడీపీ రాజ‌కీయం చేస్తుంది. విభ‌జ‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేలా బీజేపీపై ఒత్తిడి తెస్తున్న తెలుగు తమ్ముళ్ళు విభ‌జ‌న హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని టీడీపీ డిమాండ్ చేసింది. అయితే టీడీపీ డిమాండ్ పై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బీజేపీకి చెక్ పెట్టే అస్త్రం ఇదేన‌ని అంటున్నారు నెటిజ‌న్లు…అయితే దీనికి కౌంటర్ గా సోము కూడా టిడిపి పై అస్త్రాలని సంధించడానికి సర్వం సిద్దం చేసుకున్నాడని టాక్..మరో సోము ఎలా టిడిపి ని టార్గెట్ చేస్తాడు..ఎలాంటి సంచలన విషయాలు ఏపీ ప్రజలకి చెప్తాడు అని ఉత్కంటగా ఉన్నారు ఏపీ బీజేపి నాయకులు..