బీజేపీ కి సోము షాక్..కొత్త పార్టీ యోచన ?

ఏపీ బిజెపి లో భారీ మార్పులు రాబోతున్నాయి.అసలే ఏపీలో దిక్కు మొక్కు లేని బీజేపీ పార్టీ రెండు గా చీలిపోతుందా.? రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ ఫతనం అవ్వడం ఖాయమేనా అంటే అవుననే చెప్పాలి.ఏపీ ఉన్న అన్ని పార్టీలలో ఫైర్ బ్రాండ్ ఉంటారు వీరు పార్టీకి ఆపద వచ్చిన సమయంలో నోరేసుకుని పడిపోతూ ఎదో రకంగా పార్టీ ని గట్టున పడేస్తారు…,ప్రధాన పార్టీలకి ఎవరికీ తగ్గట్టుగా ఫైర్ బ్రాండ్ లు ఉన్నారు కానీ ఒక్క బీజేపీ మాత్రం సోము వీర్రాజు మాత్రమె ఉన్నారు.

 Somu Veerraju Give Shock To Ap Bjp-TeluguStop.com

ఆయన తప్ప విరుచుకు పడే మరొక నేత ఎవరూ లేరు బీజేపీకి.

అయితే త్వరలో బీజేపీ అధ్యక్షుగిగా సోము ని ప్రకటిస్తారు అనుకున్న సమయంలో ఒక్క సారిగా కన్నా సీన్ లోకి వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు.దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము తీవ్రమైన అసంతృప్తి తో రగిలి పోతున్నారు.దీంతో ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా, ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేసినా, వీర్రాజు అందుబాటులో లేడనే సమాచారం వచ్చింది.

ఇదిలాఉంటే మరోవైపు సాయంకాలం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది…అయితే ఈ రాజీనామాలు చేస్తున్న కారణం సైతం జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు వివరంగా లేఖలో పంపినట్టు తెలిపారు.

అయితే మొదట నుంచీ పార్టీలో ఉన్న తనను కాదని రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నాకు పదవి ఇవ్వడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వర్గీయుల సమాచారం.

అంతేకాదు ఇప్పుడు సోము వైపు నుంచీ మరొక వార్త వినిపిస్తోంది అదేంటంటే సోము వీర్రాజు కొత్త పార్టీ పెట్టడానికి సైతం సిద్దంగా ఉన్నారట.

ఈ విషయాన్ని ఆయన అనుచరులు చెప్పడం గమనార్హం.అంతేకాదు ఇప్పుడు సోము తెగ బాధపడుతున్నాడట.పార్టీ కోసం నాకు ఎంతో ఆప్తుడు అయిన చంద్రబాబు ని సైతం దూరం చేసుకున్నాను అని అనుచరుల దగ్గర తెగ మధన పడుతున్నాడట.ఇక ఏపీలో సోము తన వర్గం వారితో చక్రం తిప్పడానికి సిద్దం అయ్యారు.

అందుకు తగ్గట్టుగానే తూర్పు, గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు బిజెపి కి రాజీనామా చేస్తామని ప్రకటించారట.

ఈ రాజీనామా లిస్టు లో రాజమండ్రి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు రాజీనామా చేయగా ఆయన బాటలో బీజేపీ రాజమండ్రి అర్భన్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం.

అలాగే ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించారు.అసలే ఏపీలో తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న బిజెపి కి అందరూ రాజీనామాలు చేస్తూ పొతే ఇక పార్టీ మాత్రమే మిగులుతుంది అంటూ సీనియర్స్ తెగ మాధనపడుతున్నారట.

మరో సోము కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తాడా లేక తన పయనం ఎటువైపు ఉంటుందో అనే అందోళన కేంద్రం పెద్దలలో ఉందని అంటున్నారు ఏపీ బిజెపి నేతలు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube