జగన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.కరోనా సెకండ్ వేవ్ తీవ్రగ బాగా ఉన్న కారణంగా వాటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని సిఎం ను కోరారు వీరాజు.9వ తరగతి వరకు పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయగా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని లేఖలో రాశారు.ఈ పరిస్థితుల్లో జూన్ లో ఎక్సాంస్ జరపడం కూడా సమస్యగా మారుతుందని.

 Somu Veerraaju Letter To Ap Cm Ys Jagan Mohan Reddy To Cancel Ssc, Inter Exams,-TeluguStop.com

పరీక్షల కోసం పిల్లలు బస్సులు, ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని.ఆ టైం లో కరోనా మరింత ఉదృతంగా మారుతుందని అన్నారు.

విద్యార్ధుల భద్రత, రక్షణ దృష్టిలో ఉంచుకుని పరీక్షలను రద్దు చేయాలని సోము వీర్రాజు అన్నారు.

అంతేకాదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా బాధితులకు చేస్తున్న ట్రీట్మెంట్ ఛార్జీల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

రోగులను ప్రైవేట్ హాస్పిటల్ లో దోచుకుంటున్నారని.హాస్పిటల్ బిల్లిలు కట్టలేక వాటి కోసం అప్పులు చేస్తున్నారని అన్నారు.

కరోనా బాధితుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు సోము వీర్రాజు.కరోనా బాధితులకు తక్కువ ఖర్చుతో ట్రీట్ మెంట్ అందించాలని.

ఖర్చులపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు.కరోనా నియంత్రణకు మందులు, ఆక్సీజన్ లాంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube