ఢిల్లీలో వీర్రాజు ... ఏపీ బీజేపీ లో పెను మార్పులు ?

కారణం లేనిదే ఏ రాష్ట్ర నాయకుడు అధిష్టానం వద్దకు వెళ్లరు.వెళ్లలేరు.

 Somu Veeraraj Who Went To Delhi To Meet Top Bjp Leaders-TeluguStop.com

ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ బాట పట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కేంద్ర మంత్రులను కలిసేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు, మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్లు వీర్రాజు చెప్పడమే అనేక అనుమానాలకు తావిస్తోంది.

వీర్రాజు తనంతట తాను వెళ్లలేదని, ఢిల్లీకి రావలసిందిగా అధిష్ఠానం పెద్దల నుంచి పిలుపు రావడంతోనే ఆయన ఆకస్మికంగా ప్రయాణం పెట్టుకున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకాబోతున్నాయి అని, అందుకే వీర్రాజు ను ఉన్నపళంగా ఢిల్లీకి పిలిపించారనే ప్రచారం ఇప్పుడు ఊపు అందుకుంది.

 Somu Veeraraj Who Went To Delhi To Meet Top Bjp Leaders-ఢిల్లీలో వీర్రాజు … ఏపీ బీజేపీ లో పెను మార్పులు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను మారుస్తారని, ఆయన స్థానంలో మరొకరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారు అనే ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జీగా గతంలో సతీష్ జీ ఉండగా, ఇప్పుడు ఆయన స్థానంలో శివ ప్రకాష్ అనే వ్యక్తి ని నియమించారు.

ఆయన వచ్చిన తర్వాత ఏపీ బిజెపిని పరుగులు పెట్టించేందుకే సమావేశాలు నిర్వహించారు.పార్టీ నేతల్లో కదలిక తెచ్చేందుకు ప్రయత్నించారు.అయినా ఏ మార్పులు లేకపోగా, మరింత దెబ్బ తిన్నట్లు గా గుర్తించారు.దీనిపై నివేదికలు బీజేపీ అధిష్టానానికి చేరాయి.

Telugu Amithsha, Ap Bjp, Ap Bjp President, Ap Government, Central Minister Shekavath, Chandrababu, Jagan, Janasena, Kishan Reddy, Modhi, Pavan Kalyan, Somu Veerraju, Tdp-Telugu Political News

ముఖ్యంగా వైసీపీ విషయంలో వీర్రాజు సానుకూలంగా ఉంటున్నారని, ఎప్పుడూ ప్రతిపక్ష టీడీపీ పైనే విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తప్పిదాలను హైలెట్ చేయడంలో విఫలమవుతున్నారని, అలాగే జనసేన పార్టీని కలుపుకు వెళ్లే విషయంలోనూ వీర్రాజు సానుకూలంగా వ్యవహరించడం లేదని, ఇలా ఎన్నో ఫిర్యాదులు వెళ్లడంతోనే ఈ ఆకస్మిక పిలుపుకి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయి.ఏపీ లో సమూల మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ అధిష్టానం అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఎవరికి ఆ అవకాశం కల్పిస్తోందో చూడాలి.

#Chandrababu #Jagan #AP #Somu Veerraju #AP Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు