వీర్రాజు కి వచ్చిన ఇబ్బందేంటి ? ఏపీ బీజేపీ లో ఏం జరుగుతోంది ?

ఏపీలో బిజెపికి ఊపు తెచ్చే రాజకీయ పరిణామాలు మొదలయ్యాయి.హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీకి విగ్రహాల ధ్వంసం అంశం బాగా కలిసి వచ్చింది.ఈ అంశాన్ని వదిలిపెట్టకుండా, పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.దీనిని ఉపయోగించుకొని తిరుపతి ఉప ఎన్నికలలో గట్టెక్కాలని ప్లాన్ చేసుకుంటోంది.కానీ ఆ అంశం తో మైలేజ్ పెంచుకోవడం లో బిజెపి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది.కానీ ఆశించిన స్థాయిలో మైలేజ్ దక్కకపోగా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆ క్రెడిట్ కొట్టేస్తోంది.

 Bjp Ap Somu Veerraju Bandi Sanjay Ysrcp Jagan ,somu Veerraju, Ysrcp, Ys Jagan, B-TeluguStop.com

చోటామోటా నాయకుల దగ్గర నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు అంతా కట్టకట్టుకుని విజయనగరం జిల్లా రామతీర్థం లో వాలిపోయారు.గట్టిగానే హడావుడి చేస్తున్నారు.

కానీ బిజెపి ఇక్కడ పోరాటం చేస్తున్నా, ఆ స్థాయిలో క్రెడిట్ సంపాదించ లేకపోవడానికి కారణం బీజేపీలో ఏకాభిప్రాయం లేకపోవడమే.

గతంలో మాదిరిగా ఈ గ్రూపు రాజకీయాలు బిజెపిలో ఏవిధంగా ఉండేవో ఇప్పుడు ఆ విధంగానే నాయకులు వ్యవహరిస్తున్నారు.

అన్ని వర్గాల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సోము వీర్రాజు కాస్త తడబాటు గురవుతున్నట్లు గా కనిపిస్తున్నారు.ఏపీ బిజెపి నాయకులు వ్యవహారశైలిపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.

సోము వీర్రాజు ను త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని, కొత్త ప్రచారం మొదలైంది.దానిలో భాగంగానే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు అప్పగించేందుకు సిద్ధమైందని, ఆయన ఏపీ టూర్ కి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందని, ఇవన్నీ దానికి సంకేతాలనే చర్చ జరుగుతోంది.

అదీ కాకుండా, ఇప్పుడు ఏపీలో విగ్రహాల ధ్వంసం వ్యవహారం లో సోము వీర్రాజు బిజెపికి క్రెడిట్ తీసుకొచ్చే విషయంలో సక్సెస్ కాలేక పోయారని, అదే ఏపీ బండి సంజయ్, రాజా సింగ్ వంటివారు ఉండి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని, సొంత పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారట.


Telugu Amit Shah, Ap, Bandi Sanjay, Bjpap, Cm Ramesh, Pm Modi, Raja, Somu Veeraj

అలాగే ఏపీ బీజేపీ లోని ఒక వర్గం నాయకులు పూర్తిగా లెక్క చేయనట్లుగా వ్యవహరిస్తుండడం వంటివి కూడా ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా మాజీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు.వీర్రాజు వైసీపీ విషయంలో సానుకూలంగా ఉన్నారని, ఏపీ బిజెపి చేసే పోరాటాల వల్ల జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఘాటుగా విమర్శలు చేయడం లేదనే వ్యాఖ్యలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.

పార్టీ నాయకులను సమన్వయం చేసుకుంటూ ఏకాభిప్రాయంతో పార్టీని ముందుకు తీసుకు వెళుతూ, జనాల్లో బీజేపీకి ఆదరణ కలిగే విధంగా చేయడంలో వీర్రాజు వెనుక పడ్డారని, అందుకే ఆయనను మార్చాలని అధిష్టానం చూస్తున్నట్టుగా  వార్తలు ఇప్పుడు మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube