దోపిడీ ప్రభుత్వం అంటూ వైసీపీ పై సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం వల్లే జరిగిందని పేర్కొన్నారు.

 Somu Veeraaju Serious Comments On Ysrcp Governament , Bjp, Somu Veeraaju, Ysrcp , Andhra Pradesh , Cm Jagan , Modi-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని స్పష్టం చేశారు.రేషన్ బియ్యం లో రాష్ట్రం వాట రెండు రూపాయలు అయితే కేంద్రం వాట 30 రూపాయలు ఉందని అలాంటప్పుడు రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ బొమ్మ ఎలా పెడతారు అని ప్రశ్నించారు.

కేంద్రం వేసిన రోడ్లపైనే వైసీపీ నేతలు ప్రయాణం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఏపీలో అన్ని సంక్షేమ పథకాల విషయంలో బిజెపి వాటా ఉందని.తెలిపారు.విశాఖ రైల్వే జోన్ కల మోడీ నెరవేర్చారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

 Somu Veeraaju Serious Comments On Ysrcp Governament , BJP, Somu Veeraaju, YSRCP , Andhra Pradesh , Cm Jagan , Modi-దోపిడీ ప్రభుత్వం అంటూ వైసీపీ పై సోము వీర్రాజు సీరియస్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏపీలో జరిగిన అభివృద్ధికి సంబంధించి చర్చకు రావాలని కూడా వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. కరోనా సమయంలో ప్రపంచానికి మోడీ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది అని అన్నారు.

అదేవిధంగా వైసీపీ మంత్రి బొత్స సొంత జిల్లాలో రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహం శిరస్సు పై దాడి జరిగితే దాని పై పోరాడి నూతన విగ్రహం ప్రతిష్టింపజేసిన ఘనత బిజెపి దేనని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube