కొడాలి నాని కి భారీగా కౌంటర్లు వేసిన సోము వీర్రాజు..!!

వైసీపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడలో సంక్రాంతి పండుగ సమయంలో క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు రావటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఈ విషయంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వైసీపీపై మండిపడుతున్నాయి.

 Somu Veeraaju Serious Comments Kodali Nani , Somu Veeraaju, Kodali Nani-TeluguStop.com

ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నిజ నిర్ధారణ కమిటీ అంటూ గుడివాడ నియోజకవర్గంలో హడావిడి కూడా చేయడం జరిగింది.కాగా తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంలో “చలో గుడివాడ” అనే పిలుపు ఇవ్వటంతో.

కృష్ణా జిల్లా నందమూరిలో సోము వీర్రాజు ను పోలీసులు అరెస్టు చేసి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు.

అనంతరం కొద్ది సేపటికి విడిచిపెట్టారు.

తర్వాత మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ కొడాలి నాని బీజేపీనీ ఉద్దేశించి తోక పార్టీ అంటూ కామెంట్ చేయటం పట్ల సోము వీర్రాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.మాది తోక పార్టీ కాదు కోరలు ఉన్న పార్టీ అని చెప్పుకొచ్చారు.

బీజేపీ ఏపీలో స్ట్రాంగ్ పార్టీ అని తెలియజేశారు.మోడీ యొక్క అభివృద్ధి ఏ ఏపీకి శరణ్యమని చెప్పుకొచ్చారు.

ఏపీలో అధికార పార్టీ కనీసం రోడ్లు కూడా చేయలేని దుస్థితిలో ఉందని… కానీ బీజేపీ రాష్ట్రంలో అనేక నేషనల్ హైవేలు వేస్తుందని చెప్పుకొచ్చారు.నా మైండ్ సెట్ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది తిన్నగా మాట్లాడుతుంది.

నేను ఒకరికి కొడాలి నాని మాదిరిగా భక్తుడిని కాదు నేను దేశభక్తుడని అంటూ సోము వీర్రాజు.తనదైన శైలిలో కొడాలి నాని పై సెటైర్లు వేశారు.

Somu Veeraaju Serious Comments Kodali Nani Somu Veeraaju, Kodali Nani - Telugu Kodali Nani, Somu Veeraaju

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube