లోకేష్ ప్రకటన తో ఆ సీనియర్ నేత అసంతృప్తి ?

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో మహా మహా నిర్ణయాలను తీసుకున్నారు.2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన చర్యలు అన్నిటిని ఈ మహానాడు కార్యక్రమంలో చర్చించి, దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించారు.ఇప్పుడు ఆ ప్రకటన టిడిపి సీనియర్ నేతల్లో అసంతృప్తి ని రాజేస్తోంది.

 Somireddy Chandramohanreddy Not Satisfied On Lokesh Statement Nara Lokesh, Tdp, Chandrababu, Ysrcp, Ap, Telugudesam Party, Ap Governmnt, Somireddy Chandramohan Reddy, Tdp Mahanadu, Sarvepalli Constency, Kakani Goverdanreddy,-TeluguStop.com

లోకేష్ తమను పక్కనపెట్టేందుకే ఈ ప్రతిపాదన పెట్టారు అనే అనుమానాలు సీనియర్ నేతల్లో కలుకుతున్నాయి.ఇంతకీ లోకేష్ చేసిన ప్రకటన ఏంటంటే, వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి ఇకపై టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

అంటే 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన వారికి ఇకపై అవకాశం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

 Somireddy Chandramohanreddy Not Satisfied On Lokesh Statement Nara Lokesh, Tdp, Chandrababu, Ysrcp, Ap, Telugudesam Party, Ap Governmnt, Somireddy Chandramohan Reddy, Tdp Mahanadu, Sarvepalli Constency, Kakani Goverdanreddy,-లోకేష్ ప్రకటన తో ఆ సీనియర్ నేత అసంతృప్తి -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నిర్ణయం అమలైతే టిడిపి సీనియర్ నేత గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఈ ఎఫెక్ట్ పడుతుంది.

ఇప్పటికే ఐదు సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినా 1999 లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే ఎమ్యెల్యే గా గెలిచారు.ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి చెందుతూనే వస్తున్నారు.

ప్రస్తుతం తన రాజకీయ ప్రత్యర్ధి , మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.

Telugu Ap Governmnt, Chandrababu, Kakani Goverdan, Lokesh, Tdp Mahanadu, Telugudesam, Ysrcp-Politics

ఈ మేరకు నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, టిడిపి మహానాడు లో లోకేష్ చేసిన ప్రకటన చంద్రమోహన్ రెడ్డి కి అసంతృప్తిని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.చంద్రమహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా , ఆయన కుమారుడికి అవకాశం దక్కే ఛాన్స్ ఉన్నా.చంద్రమోహన్ రెడ్డి మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే కసి తో ఉన్నారు.

కానీ ఇప్పుడు ఆయన ఆశలు అడియాశలు అయ్యాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube