ఏకులా వచ్చి మేకులా మారుతున్నారా ? జగన్ కు తలనొప్పులేనా ?

ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.ఎన్నికల ముందు ఏ పార్టీ గాలి బలంగా వీస్తుందో, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని నాయకులు పార్టీలు మారిపోతుంటారు.

 Some Ycp Leaders Not Listing The Jagan Mohan Reddy Words-TeluguStop.com

ఇదంతా రాజకీయాల్లో సర్వ సాధారణంగా జరిగే తంతు.ఆ విధంగానే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు చాలామంది నాయకులు వైసీపీలోకి వచ్చి చేరారు.

టీడీపీలోకి వెళ్ళాక పదవులు చేపట్టిన వారు, బలమైన నాయకులు కూడా జగన్ మీద నమ్మకంతో పార్టీలో చేరారు.అయితే ఇలా వచ్చి చేరినవారు ఇప్పుడు వైసీపీలో గుర్తింపు కోసం, ప్రభుత్వంలో పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ లేనిపోని వివాదాలకు కారణం అవుతున్నారు.

Telugu Amanchikrishna, Anamram, Apcm, Roja, Ycpjagan, Thota Simha-

వాస్తవంగా చెప్పకుంటే మొదటి నుంచి వైసీపీకి అండగా నిలబడి ఎన్నో ఇబ్బందులకు గురైన నాయకులు చాలామంది ఉన్నారు.ఉదాహరణగా చెప్పుకుంటే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయ సాయి రెడ్డి ఇంకా మరి కొంతమంది నాయకులు వైసీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు.ఒకరకంగా వైసీపీని మొదటి నుంచి అండగా నిలబడుతూ వస్తున్నచాలామంది నాయకులకు ప్రభుత్వంలో ఇప్పటి వరకు సరైన, కీలకమైన పదవులు దక్కలేదు.అయినా వారు ఓపికతో, జగన్ మీద నమ్మకంతో పార్టీ విధేయులుగా ఉంటూ వస్తున్నారు.

కానీ ఎన్నికలకు ముందు ఆ తరువాత పార్టీలో చేరిన కొంతమంది నాయకులు తమకు పదవులు రాలేదని బహిరంగంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

Telugu Amanchikrishna, Anamram, Apcm, Roja, Ycpjagan, Thota Simha-

ఇలా జగన్ కు ఇబ్బందికరంగా మారిన వారిలో కొంతమందిని ఉదాహరణగా చూస్తే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రాంనారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణమోహన్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట నరసింహం, తోట వాణి వంటివారు ప్రధానంగా కనిపిస్తున్నారు.

Telugu Amanchikrishna, Anamram, Apcm, Roja, Ycpjagan, Thota Simha-

వీరిలో కొంతమంది అప్పుడే ధిక్కార స్వరం వినిపిస్తూ పార్టీ మారిపోతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఇవన్నీ ఇప్పుడు జగన్ కు తలనొప్పి వ్యవహారాల్లా మారాయి.ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించేందుకు ఇబ్బందులు పడుతూనే మరోవైపు పార్టీ నాయకుల అసమ్మతి గళాన్ని కంట్రోల్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube