జగన్ అనుగ్రహం కోసం ఆ టీడీపీ నేతల వెయిటింగ్ ?

ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి , ఆ పార్టీ నుంచి ఈ పాటికి వలసలు అనేవి రాజకీయాల్లో సర్వసాధారణం.అధికారంలో ఏపార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి సాధారణంగా ఎక్కువగా వలసలు జరుగుతూ ఉంటాయి.

 Some Tdp Leaders Try To Join In Ysrcp, Jagan, Ysrcp,ap, Tdp, Chandrababu, Ap Gov-TeluguStop.com

అధికార పార్టీ లో ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అందుకే అవకాశం దొరికితే పార్టీ మారిపోయెందుకు ఇతర పార్టీల నేతలు ప్రయత్నిస్తూ ఉంటారు.

ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలతోపాటు మరెంతో మంది నాయకులు టిడిపి కండువా కప్పుకున్నారు.కీలకమైన మంత్రి పదవులతో పాటు ఎంతో ప్రాధాన్యం పొందారు.2019 కి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి.అధికార పార్టీ గా వైసిపి మారడంతో టిడిపి నుంచి ఎంతోమంది కీలక నాయకులు వైసీపీ కండువా కప్పుకున్నారు.

నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ కి అనుబంధంగా కొనసాగుతున్నారు.ఇక మరెంతో మంది నాయకులు టిడిపి నుంచి వైసిపి లోకి వద్దాం అని చూస్తున్నా, అందుకు తగ్గ పరిస్థితులు మాత్రం ఏర్పడడం లేదు.

దీనికి కారణం జగన్ తీసుకున్న నిర్ణయమే.పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నాయకులు అందరినీ చేర్చుకుంటూ జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ఏపీలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది నాయకులు వైసీపీ లోకి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నుంచి వచ్చేందుకు కీలకమైన నాయకులు క్యూ కడుతున్న జగన్ మాత్రం ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను, టిడిపి నుంచి వచ్చే వారి వల్ల పార్టీకి జరిగే మేలు, నియోజకవర్గంలో నాయకులతో సమన్వయం కాగలరా లేదా ఇలా అనేక అంశాలను లెక్కలోకి తీసుకుని మాత్రమే వలసలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

దీంతో చాలామంది వెయిటింగ్ లో ఉండి పోతున్నారు.

Telugu @ncbn, Ap Cm, Ap, Chandrababu, Jagan, Tdp Join Ysrcp, Tdp Mlas, Ysrcp-Tel

 టిడిపి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉండటంతో వైసీపీలో చేరాలని చాలా మంది టిడిపి నాయకులు వెయిటింగ్ లో ఉన్నారు.అందుకే ప్రస్తుతం వలస వద్దాం అనుకుంటున్నా నాయకులంతా టిడిపిలో ఉన్నా, పెద్దగా యాక్టివ్ గా అయితే లేరు.ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన కొంతమందికి పదవులతో పాటు కొన్ని కీలకమైన నామినేటెడ్ పదవులు దక్కడం తో మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు.

గ్రీన్ సిగ్నల్ లభించగానే ఆలస్యం చేయకుండా వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube