ఆ టీడీపీ నేతల మనసు జనసేన వైపు చూపు ? 

ఏపీలో జనసేన దశ తిరిగినట్టుగానే కనిపిస్తోంది.ఇతర పార్టీలలో ప్రాధాన్యం దక్కని వారు, 2024 ఎన్నికల ఫలితాలను ఖచ్చితంగా అంచనా వేయగలిగిన నేతలు ఇప్పటి నుంచే జనసేనలోకి క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.

 Pavan Kalyan, Tdp, Cbn, Chandrababu, Ydrcp, Tdp Janasena Aliance, Ap Government,-TeluguStop.com

ముఖ్యంగా ఏపీ లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన వైపు చూస్తున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.తెలుగుదేశం పార్టీ అధిష్టానం పై అసంతృప్తి రాబోయే రోజుల్లో ఆ పార్టీ భవిష్యత్తు, ఇవన్నీ ఊహించుకుని చాలా మంది నేతలు జనసేన లోకి వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తు కు ఢోకా లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

జనసేన, టిడిపి 2024 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నా, తాము జనసేన లో చేరితే తమ సీటుకు ఎటువంటి ఢోకా లేకుండా చేసుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీలో చేరి తమ సీట్లు రిజర్వ్ చేసుకునే ఆలోచనలో చాలామంది నాయకులు కనిపిస్తున్నారు.

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో జనసేన వైపు చూస్తున్నాయి.

టిడిపి, జనసేన పొత్తు పెట్టుకున్నా, ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని, తమకు ఎటువంటి ఢోకా ఉండదు అనే అంచనాలో ఉన్న చాలా మంది టిడిపి నాయకులు తమ ప్రాంతంలో జనసేనకు ఉన్న బలం బలగం అంచనావేసి మరీ ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.ఉభయగోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.

అనేక నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఖాయం అన్న పరిస్థితి ఉంది.జనసేన కు ఆ సామాజిక వర్గం లో పూర్తిగా పట్టు ఉండడంతో అనేకమంది టిడిపి బిసి నాయకులు జనసేన లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan, Pavan Kalyan, Tdpjanasena, Ydrcp-Telugu Po

అదీ కాకుండా, టిడిపిలో కొంతమంది సీనియర్ నాయకుల వ్యవహారశైలిపై పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అటువంటి వారంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు.ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప వంటి వారి వ్యవహారశైలిపై తూర్పుగోదావరి జిల్లా టిడిపి నేతల్లో కొంత అసంతృప్తి ఉంది.వారి వ్యవహారశైలి నచ్చని కొంతమంది ఆ జిల్లా నాయకులు జనసేన లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

వీరిలో ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 2019 లో గెలిచిన పిల్లి అనంతలక్ష్మి చాలా కాలం క్రితమే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తన రాజీనామాకు కారణం చినరాజప్ప అంటూ బహిరంగంగానే ప్రకటించారు.

అయితే ఇప్పుడు పిల్లి అనంతలక్ష్మి ఇప్పుడు జనసేన లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.దీనికి కారణం ఆమె గతంలో పోటీ చేసి గెలిచిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన కేడర్ బలంగా ఉండటంతో గెలుపు తనకే దక్కుతుందనే నమ్మకంతో ఆమె ఉన్నారు.

అలాగే రాజనగరం నుంచి గతంలో టిడిపి నుంచి గెలిచిన పెందుర్తి వెంకటేష్ సైతం జనసేన చేరేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నియోజకవర్గంలోనూ జనసేన బలంగా ఉండడంతో ఆ పార్టీలో చేరితే తనకే విజయం ఖాయం అనే ధీమాలో ఆయన ఉన్నారట.

ఆయనకు చాలా మంది టిడిపి అసంతృప్తి నాయకులతో పాటు, జనసేన ప్రభావంపై ఒక క్లారిటీ ఉన్న నేతలంతా ఇప్పుడు టీడీపీని వీడి జనసేన వైపు క్యూ కట్టేందుకు సిద్ధం అవుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube