శివసేనలో చీలిక, బీజేపీకి లైన్‌ క్లీయర్‌  

Some Siva Sena Party Mla\'s Join In Bjp Party-maharastra Assembly Elections,siva Sena And Bjp,siva Sena Party Mla\\'s

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంకు అతి త్వరలోనే తెర పడుతుందని ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు భావిస్తున్నారు.బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా కూడా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు 40 సీట్ల దూరంలో ఉంది.కనుక శివసేన పార్టీ ముఖ్యమంత్రి పీఠంను కోరుతుంది.కాని బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.ఈ సమయంలో శివసేన వెనక్కు తగ్గి ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందించి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి కీలక పదవులు కోరితే బాగుంటుందని కొందరు శివసేన పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Some Siva Sena Party Mla\'s Join In Bjp Party-maharastra Assembly Elections,siva Sena And Bjp,siva Sena Party Mla\'s-Some Siva Sena Party MLA'S Join In BJP Party-Maharastra Assembly Elections Siva And Bjp Mla\'s

కొందరు శివసేన పార్టీ నాయకులు మాత్రం ఇప్పుడు తప్పితే మళ్లీ సీఎం పీఠంపై కూర్చునే అవకాశం వస్తుందో రాదో ఈ అవకాశంను వదులుకోవద్దంటూ డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలు రెండుగా విడిపోయినట్లుగా సమాచారం అందుతోంది.బీజేపీకి మద్దతు ఇవ్వాలని దాదాపుగా 25 మంది శివసేన ఎమ్మెల్యేలు అధినాయకత్వంతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది.వారి మాట అధినాయకత్వం వినకుంటే బీజేపీలోకి వారు మొగ్గే అవకాశం ఎక్కువగా ఉందంటూ సమాచారం అందుతోంది.

వారి రాకతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు మార్గం కాస్త సుగమం అవుతుంది.మరి కొందరు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు.