హెచ్ -1 వీసాదారుల భాగస్వాములకి భారీ ఊరట

హెచ్ -1 బీ వీసా దారులు గత కొంతకాలంగా పడుతున్న టెన్షన్ కి నేటితో తెర పడింది.వచ్చే ఏడాది వరకూ కూడా హెచ్ -4 వీసాల పై నిషేధం విధించబోమని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ విభాగం తెలిపింది.

 Some Relief For H 1b Visa Holders Spouses And Relatives-TeluguStop.com

ఈ తాజా నిర్ణయంతో భారతీయులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే అమెరికాలో హెచ్ -4 వీసా ఉపయోగించి అత్యధికంగా తమ జీవిత భాగస్వాములని అమెరికా తీసుకు వెళ్ళింది భారతీయులే.

2015 లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్ – 1 బీ వీసా దారుల పిల్లలు, జీవిత భాగస్వాములు అమెరికాలోకి ప్రవేశించేలా హెచ్ -4 వీసా ప్రవేశపెట్టారు.దాంతో చాలా మంది జీవిత భాగస్వాములు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

ఈ వీసాల జారీ కారణంగా అమెరికాలోని స్థానిక ప్రజల నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ట్రంప్ ఈ వీసాలని ఎత్తి వేయాలని అనుకున్నారు.

Telugu Visa Holders, Ead, Indians, Spouses-

 

అయితే తాజాగా హోమ్ ల్యాండ్ తీసుకున్న నిర్ణయంతో హెచ్ -4 వీసా ఎత్తి వేసే అవకాశం ఇప్పటిలో లేదు కాబట్టి హెచ్ -1 బీ వేసా దారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.అయితే ఈ రద్దు నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేసేలా చేయాలని భారత ఎన్నారైలు అభ్యర్దిస్తున్నారు.ఏది ఏమైనా ఈ తాజా నిర్ణయం భారతీయులకి పెద్ద ఊరట ఇచ్చిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube