కవాతు పై ప్రభుత్వం కుట్ర..??   Some Of The Restrictions On Janasena Kavathu     2018-10-15   15:49:37  IST  Surya

జనసేన కవాతు ప్రవాహానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది..జనసేన వీర మహిళలు మొదలు జనసేన యువ కార్యకర్తలని సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు అంటూ వార్తలు వస్తున్నా నేపధ్యంలోనే ఇప్పుడు మరొక వార్త సంచలనం సృష్టిస్తోంది..కవాతుపై పోలీసులు అభ్యంతరం తెలుపుతున్నారు అనే వార్త అన్ని మీడియా సంస్థలలో రావడంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు…అయితే పోలీసుల అభ్యతరం ఎంతవరకూ నిజం ఉందనే వివరాలలోకి వెళ్తే..

ధవళేశ్వరం బ్యారేజీ పిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయని ఈ కారణంగానే తాము అనుమతిని నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు…ఇదే విషయాన్ని ఆ పార్టీ జనసేన కవాతు నిర్వాహణ భాద్యతలు చూస్తున్న కందుల దుర్గేష్ గారికి పోలీసులు వెళ్లి స్వయంగా చెప్పారట..అయితే బ్రిడ్జి బలహీనంగా ఉందని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి బలహీనంగా ఉన్నందున కవాతుకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.

బ్రిడ్జిపై పదివేల కంటే ఎక్కువ మంది వెళ్తే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారట..అయితే ఈ విషయంపై మాజీ ఎమ్మెల్సీ, జనసేన నేత కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ పోలీసులు తమ దగ్గరకి వచ్చి ఈ విషయాలు వెల్లడించిన మాట వాస్తవమే అయితే నిన్న రాత్రి సమయంలో కూడా ఈ కవాతు కి సంభందించి ఎంతమంది వస్తారు ఒక వేళ సమస్యలకి తగ్గట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై పోలీసులతో చర్చించామని.

Some Of The Restrictions On Janasena Kavathu-

అయితే ఇప్పుడు ఒక్క సారిగా కవాతు కి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రభుత్వమే కావాలని అడ్డు పడుతోందని ఎవరు అడ్డు పడినా సరే కవాతు జరిగి తీరుతుందని దుర్గేష్ తెలిపారు..అంతేకాదు..ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కి జనసేన సైనికులకి భయపడుతోంది అనడానికి అనుమతి నిరాకరించాలని అనుకోవడమే నిదర్శనమని తెలిపారు. పోలీసులు వచ్చి కవాతు విషయంలో అనుకోని సంఘటనలు జరిగితే భాద్యత వహిస్తారా అని అడిగినప్పుడు లెటర్ మీద రాసి ఇచ్చాని దుర్గేష్ తెలిపారు..దాదాపు 2 లక్షల మంది కవాతు కి హాజరవుతారని అంచనా వేస్తున్నారు జనసేన నేతలు..వారికి తగ్గట్టుగానే సదుపాయాలు కూడా అమర్చినట్టుగా తెలిపారు.