తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు... వాటి విశిష్టతలు ఇవే?

మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి.ఈ విధంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ఎంతో చరిత్రను కలిగి ఉన్నాయి.

 Some Of The Most Magnificent Temples In Telangana And Their Greatness Telangana,-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో వెలసిన కొన్ని క్షేత్రాలు ఎంతో ప్రాముఖ్యతను విశిష్టతను సంతరించుకున్నాయి.మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాలు వాటి విశిష్టతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సరస్వతి ఆలయం: భారత దేశంలోనే కేవలం రెండు ఆలయాలు మాత్రమే ఉన్న సరస్వతి ఆలయాలు ఒకటి కాశ్మీర్ లో ఉండగా మరొకటి తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ఉంది.ఈ ఆలయానికి ప్రతి ఏటా వసంత పంచమి పురస్కరించుకుని భక్తులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు.

ఇక ఈ ఆలయంలోనే వేద మహర్షి సరస్వతి దేవి ఆశీర్వాదం కోసం తపస్సు చేసి మహాభాగవతం రచించడం వల్ల ఈ ప్రాంతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

బ్రహ్మ ఆలయం:

Telugu Bramha Temple, Kalashwaram, Telangana, Temples-Telugu Bhakthi

భృగు మహర్షి శాపం కారణంగా ఆలయాలలో కొలువై ఉండి పూజకు నోచుకోని బ్రహ్మ ఆలయాలు మన దేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి.మన దేశం మొత్తానికి బ్రహ్మ దేవుని ఆలయాలు కేవలం మనకు రెండు చోట్ల మాత్రమే దర్శనమిస్తాయి.ఇందులో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంటె మరొక ఆలయం తెలంగాణలోని ధర్మపురిలో ఉంది.

 ఇక ఈ ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయంలో మనకు యోగలక్ష్మీ నృసింహుని ఆలయమమునందు ఎక్కడా కనబడని బ్రహ్మ దేవుని విగ్రహము, యముని విగ్రహం రెండు దర్శనమిస్తాయి.ఈ ఆలయంలోనే యముడు శివుడి కోసం తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి.

త్రివేణి సంగమం: మనదేశంలో త్రివేణి సంగమం ఉన్నది కూడా కేవలం రెండు ప్రాంతాలలో మాత్రమే.అది ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో ఉంటె మరొకటి తెలంగాణలోని కాళేశ్వరంలో ఉంది.

తెలంగాణలోని కాలేశ్వరంలో ఉన్న ఆలయం విషయానికి వస్తే సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా మనకు కేవలం ఒకటే విగ్రహం దర్శనమిస్తుంది.కానీ ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ఆలయంలో మాత్రం ఒక గర్భగుడిలో మనకు శివుడు, యముడు దర్శనం కల్పించడం విశేషం.

మన దేశం మొత్తంలో కెల్లా ఓకే గర్భగుడిలో రెండు విగ్రహాలు కనిపించడం ఈ ఆలయంలో అని మాత్రమే చెప్పాలి.తెలంగాణలోని పలు ఆలయాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube