హాట్ కేక్స్ లా అమ్మేస్తున్న నకిలీ సర్టిఫికెట్స్...!

ఏ చదువుకు సంబంధించిన సర్టిఫికెట్ అయినా సరే ఇట్లే ఇచ్చేస్తాం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా ఒక ముఠానే ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తోంది.డిగ్రీ, అగ్రికల్చర్ డిప్లమా, బీటెక్… ఇలా కోర్స్ ఏదైనా సరే అనేక సంవత్సరాలు కష్టపడి చదవాల్సిన అవసరం లేకుండా కేవలం కొద్దీ నిమిషాల్లోనే వారి పేరు మీద నకిలీ సర్టిఫికెట్ ను తయారుచేసి వేలల్లో దండుకుంటుంది ఈ ముఠా.

 Fake Certificates, Andhrapradesh, Education, Fertilizer Shop,-TeluguStop.com

దుకాణం ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క రేటు పెట్టి అమ్ముతోంది.ఇందుకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కేంద్రంగా ఈ దందాను కొనసాగిస్తున్నారు ఈ ముఠా.Jntc పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో ఫేక్ సర్టిఫికెట్ లను విక్రయిస్తున్నారు.

ఇందుకు సంబంధించి పోలీసులు విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ముఠా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో వారి బ్రాంచీలను ఓపెన్ చేసి నకిలీ సర్టిఫికెట్ల ఇస్తున్నారంటే వారి దందా ఏ రేంజ్ లో కొనసాగుతుందో చెప్పవచ్చు.

ఈ దందాను మొత్తం ఏడు మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి వారి బంధం మొదలుపెట్టారు.

ఈ నకిలీ సర్టిఫికెట్ల కోసం రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని కొంతమంది ఏజెన్సీ ద్వారా జనాలను ఆకర్షించి డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లను జారీ చేయడం మొదలుపెట్టారు.

దీంతో ఆ సభ్యులపై అనేక ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటివరకు మీరు 1900 సర్టిఫికెట్స్ ను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జారీ చేశారని, మొత్తంగా 2400 నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు పోలీసులు తేల్చారు.

వీరి సంగతి ఎలా బయట పడిందంటే ఇటీవల కొందరు వ్యవసాయ అధికారులు ఒక ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేయగా అక్కడ షాప్ యజమాని చూపిన అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ పరిశీలించగా తనిఖీ చేయడంతో గుట్టు రట్టయింది.ఈ మూట సర్టిఫికెట్ల కొరకు రూ.2000 నుండి 10 వేల వరకు తీసుకుంటున్నట్లు వారి విచారణలో తెలిసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube