ఆపద్బాంధవుడు చిత్రంలో చిరు సరసన నటించిన మీనాక్షి శేషాద్రి గుర్తుందా..? ఇప్పుడెలా ఉందో తెలుసా..?

చుక్కల్లారా.దిక్కుల్లారా…ఎక్కడమ్మా జాబిలీ.! అంటూ మతిస్థిమితం లేని అమ్మాయిలాగా అద్భుతంగా నటించడమే కాదు “ఔరా అమ్మకు చెల్లా.ఆలకించి నమ్మడం ఎల్ల” అంటూ అమాయకంగా కూడా పాడింది.ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.? అదే అండి “చిరంజీవి” గారు నటించిన “ఆపద్బాంధవుడు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన “మీనాక్షి శేషాద్రి”.ఆ సినిమానూ ఆ నటననూ ఎవరు మర్చిపోగలరు.! నిజానికి మీనాక్షి తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది కానీ హిందీలో ఎంతో పేరున్న నటి.

 Some Lesser Known Facts About Meenakshi Seshadri-TeluguStop.com

ఈమె అసలు పేరు శశికళ శేషాద్రి.ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది.తమిళ కుటుంబానికి చెందిన ఈమె భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి డాన్సుల్లో ప్రావీణ్యం గడించింది.ఢిల్లీ లో స్టడీస్ టైం లోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయింది.

ఇక ఈమెకు మోడల్ గా అవకాశాలు రావడంతో టాప్ మోడల్ గా పేరు తెచ్చుకుంది.అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి.

పాయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి, శభాష్ రాముడు డైరెక్షన్ లో హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి, ఒక్క రోజులో స్టార్ హీరోయిన్ అయిపొయింది.అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్నీ డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.అంతేకాదు.మీనాక్షి 1980- 90లలో భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది.సీనియర్ ఎన్టీఆర్ తో బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమాలో నటించింది.మెగాస్టార్ చిరంజీవితో ఆపద్భాంధవుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది.

మరి ఇప్పుడు ఆ హీరోయిన్ ఎలా ఉంది.? ఎవర్ని పెళ్లి చేసుకుంది.?

హరీష్ మైసూర్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది సినిమాలకు దూరమైంది.ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్న మీనాక్షి ‘చెరిష్‌’ పేరుతో డాన్స్‌ స్కూల్‌ని నడుపుతూ భారతీయ సంప్రదాయ నృత్యాలను నేర్పుతోంది.

సినిమాల్లోకి వచ్చేసరికే మీనాక్షికి భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్‌లలో ఎంతో ప్రావీణ్యం ఉంది.వీలైనప్పుడల్లా తన శిష్యులతో కలసి నాట్య ప్రదర్శనలు ఇచ్చి విరాళాలు సేకరించి వాటిని సేవాకార్యక్రమాలకూ ఉపయోగిస్తోంది.

మీనాక్షికి ముగ్గురు పిల్లలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube