కాంగ్రెస్ సీనియర్లే రేవంత్ శత్రువులు ? 

శత్రువులు ఎక్కడో ఉండరు.మన చుట్టూనే,  మనతోనే ఉంటూ, అదును చూసి దెబ్బ తీస్తారు.

 Revanth Reddy, Congress, Telangana, Congress Seniour Leaders, Bjp, Trs, Hujuraba-TeluguStop.com

ఇక రాజకీయాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంటుంది.

కాంగ్రెస్ లో ప్రస్తుతం వాతావరణం ఇదే విధంగా ఉంది.పిసిసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతున్నాయి.

సహజంగానే వాక్చాతుర్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది.ఎవరికీ వారు తామే గొప్ప అన్న ఫీలింగ్ లో ఉండడంతో పాటు, ఎవరికి వారికి వ్యక్తిగతంగా అధిష్టానం పెద్దల వద్ద పలుకుబడి ఉండడంతో, ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇక పిసిసి అధ్యక్ష పదవి పై చాలా మంది పార్టీ సీనియర్లు ఆశలు పెట్టుకున్నా, వారందరినీ కాదు అని టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి కి ఆ పదవప్పగించారు.దీనిపై సీనియర్ నాయకుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయినట్టుగా కనిపించింది.

Telugu Congress, Hujurabad, Komtati Venkat, Koushik Reddy, Revanth Reddy, Telang

కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు, మరి కొంతమంది నాయకులు మాత్రమే బహిరంగంగా విమర్శలు చేశారు.దీనికితోడు సీనియర్ నాయకులు అందరూ రేవంత్ కి మద్దతు అన్నట్టుగా వ్యవహరించారు.దీనికి తోడు రేవంత్ సైతం సీనియర్ కాంగ్రెస్ నేతలను వారి ఇళ్లకు వెళ్లి మరీ కలవడంతో వారంతా మెత్తబడినట్టుగానే కనిపించారు.దీంతో ఇక కాంగ్రెస్ సీనియర్లు అంతా ఒకటై టిఆర్ఎస్ బిజెపి లపై పోరాడుతారు అని అంతా అంచనా వేసినా, కాంగ్రెస్ లో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది.

పైకి రేవంత్ నాయకత్వంలో పని చేస్తామని సీనియర్ నాయకులు చెబుతున్నా, తెరవెనుక మాత్రం ఎవరి వ్యూహాల్లో వారు ఉంటూ రేవంత్ పై తమ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు.

ఇక హుజురాబాద్ అభ్యర్థిగా ప్రచారమైన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నట్లు మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చింది.తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పై రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఆందోళన కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షుడి హోదాలో నిర్వహించారు.

దీనికోసం భారీ ఎత్తున కేడర్ ను కూడగట్టే ప్రయత్నాలు చేశారు.అయితే అంతకు ముందు రోజే ఈ పరిణామాలన్నీ చోటుచేసుకోవడం, రేవంత్ కార్యక్రమానికి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడం వంటి వ్యవహారాలు చూస్తుంటే, కాంగ్రెస్ సీనియర్లు ఇంకా రేవంత్ పై అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది.

Telugu Congress, Hujurabad, Komtati Venkat, Koushik Reddy, Revanth Reddy, Telang

ఇప్పుడే కాదు రానున్న రోజుల్లో రేవంత్ కు ఇదే రకమైన ఇబ్బందులు సృష్టించే విధంగా కాంగ్రెస్ సీనియర్లు కొంతమంది వ్యవహరించబోతున్నారు అనే విధంగా వ్యవహారం చోటు చేసుకుంటూ ఉండడం చూస్తుంటే, కాంగ్రెస్ లో ఎప్పటికీ మార్పు రాదు అన్నట్లుగానే అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube