తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఏకైక నటుడు పవన్ కళ్యాణ్…( Pawan Kalyan ) ఈయన చేసిన సినిమాలు సాధించిన విజయాలను చూస్తే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మనకు అర్థమవుతుంది.ఇక ఇదిలా ఉంటే ఆయన 2014 వ సంవత్సరంలో జనసేన పార్టీ( Janasena Party ) పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పుడు కూడా ఏపీ ఎలక్షన్స్ లో తను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
జనసేన పార్టీ తరఫున పోటీ చేయడమే కాకుండా తనతో పాటు ఉన్న కొంత మందికి కూడా టికెట్లు ఇచ్చి వాళ్ళ చేత పోటీ చేయిస్తున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే హైపర్ ఆది,( Hyper Adi ) జానీ మాస్టర్( Jaani Master ) లాంటి కొంతమంది సెలబ్రిటీలు సైతం పార్టీలో చేరారు అయితే వీళ్లు పార్టీ తరపున పోటీ చేయకపోయినప్పటికీ పార్టీ తరుపున పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే అధికార పార్టీ మీద విమర్శలు చేయడం చేస్తున్న వీళ్ళకి సినిమాల్లో కొన్ని అవకాశాలు అయితే తగ్గుతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి.
మరి దానికి తోడుగా జనసెన కి సపోర్ట్ చేయడం వల్ల సినిమాల్లో అవకాశాలు వస్తాయి.కానీ మిగతా వాళ్ళ సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.
ఇక మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే హైపర్ ఆది, జానీ మాస్టర్ మాత్రం సినిమాల్లో అవకాశాలు రాకపోయిన పర్లేదు కానీ, పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రచారం చేస్తాం అంటూ వాళ్లు తెగించిన ధైర్యంతో ముందుకు రావడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఈసారి పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు గెలుస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
.