నేటి అమావాస్యకు ఇంత ప్రత్యేకత ఉందా..?

పురాణాల ప్రకారం ప్రతి అమావాస్య కి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఈరోజు వచ్చే అమావాస్య కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు.

 Sawan Somvar Vrat Significance In Hindu Tradition, Hindu Tradition, Amavasya, So-TeluguStop.com

ఈరోజు వచ్చే అమావాస్యను సోమతి అమావాస్య అంటారట.ఈ రోజున ఉపవాసం చేసి రావిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే.సకల దోషాలు తొలగిపోతాయట.

ఈరోజు పెళ్లి అయిన వారితో పాటు పెళ్లి జరగని వారు కూడా రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు కూడా తీరుతాయని ప్రగాఢ విశ్వాసం .అంతేకాకుండా పితృదేవతలకు ఈరోజు వచ్చే అమావాస్య రోజున పిండ ప్రధానం చేయడం లాంటివి చేస్తే పితృ దేవుళ్ళు ఎంతగానో సంతృప్తి చెందుతారట… అంతే కాకుండా మనకు ఎంతో మంచి జరుగుతుందని ఎంతోమంది విశ్వసిస్తారు.

అంతేకాకుండా ఈ అమావాస్య రోజున కొత్త కోడలు చుక్కల అమావాస్య పేరుతో ఒక ప్రత్యేకమైన నోమును నోచుకుంటారట.

గౌరీ పూజ చేసి సాయం సంధ్యవేళలో నిష్టగా ఉపవాసం ఆచరించి దైవాన్ని కొలుస్తారట.ఇక వివాహం జరిగని వారు ఇలాంటి నోము చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుందని ఎంతో విశ్వసిస్తూ ఉంటారట, ఇక పెళ్లయిన వారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలని కోరుకుంటారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube