ఆచార్యకు అది దొరకడమే లేదట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై తనదైన మార్క్ వేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.

 Solo Release Not Possible For Acharya, Acharya, Chiranjeevi, Ram Charan, Koratal-TeluguStop.com

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో చిరంజీవి పాత్ర అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకోవడంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.

ఇక మొదటి వేవ్ కరోనా తరువాత వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో మరోసారి ఆచార్యకు అడ్డంకి ఎదురయ్యింది.

దీంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది.కాగా ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలు తమ రిలీజ్ డేట్లను సంక్రాంతి వరకు ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాయి.

ఈ క్రమంలో ఆచార్య మాత్రం సోలో రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తోంది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆచార్యకు సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టంలా కనిపిస్తుంది.

దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా అది వీలుపడే అవకాశం కనిపించడం లేదు.దీంతో దసరాకు వేరే సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

ఇక క్రిస్మస్ కానుకగా పుష్ప, సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు రెడీగా ఉండటంతో ఆచార్య చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.మరి సోలోగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఆచార్యకు దొరుకుతుందో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube