ప్రేమ కూడా ఒక ఫీలింగే అంటున్న తేజు! లవర్స్ డే రోజు సింగిల్స్ కి గిఫ్ట్  

Solo Brathuke so Betteru Theme Slogan Teaser For February 14 Gift - Telugu February 14 Gift, Slogan Teaser, Solo Brathuke So Betteru Themem, Valentines Day

సాయి ధరమ్ తేజ్ సుబ్బు అనే యువ దర్శకుడుతో కలిసి సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.ఇందులో లైఫ్ లో లవర్ లేని సింగిల్ బ్యాచలర్స్ కి, సోలో బ్రతుకు కోరుకునే అందరికి రోల్ మోడల్ గా తేజు కనిపించబోతున్నాడు.

Solo Brathuke So Betteru Theme Slogan Teaser For February 14 Gift

ఇదిలా ఉంటే ప్రేమికుల రోజున టాలీవుడ్ లో ప్రేమ కథలని చూపిస్తూ లవర్స్ కి గిఫ్ట్ గా అందరూ ఇస్తూ ఉంటే తేజు మాత్రం ప్రేమికులు లేని సింగిల్స్ కోసం సోలో బ్రతుకే సో బెటర్ అంటూ థీమ్ టీజర్ తో వచ్చాడు.

కష్టం, ఇష్టం, సంతోషం, విచారం, ఆనందం, బాధ అనేవి కాలంతో మారుతున్న ఫీలింగ్స్ అవుతున్నప్పుడు ప్రేమ అనేది కూడా ఫీలింగే కదా… మారదని గ్యారెంటీ ఏంటి?… అందుకే ఈ వేలెంటైన్ వీకెండ్ ని మనం అంతా కలిసి జరుపుకుందాం… సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లోగన్ ఇస్తాడు.దీంతో అందరూ అతని మాటకి స్లొగన్స్ ఇస్తూ సోలో బ్రతుకే సో బెటర్ అంటారు.ఈ థీమ్ వీడియో ని సింగిల్ గా ఉన్న బ్యాచలర్స్ అందరికి అంకితం ఇస్తూ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

కాస్తా ఇంటరెస్టింగ్ గా ఈ జెనరేషన్ లో లవర్ ఫెయిల్యూర్ యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా, పెళ్ళికి ముందు లవ్ స్టోరీస్ ఇష్టపడని వారిని ఈ వీడియో టీజర్ ఇంప్రెస్ చేసే విధంగానే ఉంది.గతంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన బ్రహ్మచారి మొగుడు అనే సినిమాకి కాస్తా దగ్గర పోలికలు ఉన్న కూడా ప్రెజెంటేషన్ విషయంలో మాత్రం ట్రెండ్ కి తగ్గట్లు ఉంది.

మరి తేజుకి ఈ సినిమాతో కెరియర్ లో మరో హ్యాట్రిక్ హిట్ వస్తుందేమో చూడాలి.

#Valentines Day #Slogan Teaser

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Solo Brathuke So Betteru Theme Slogan Teaser For February 14 Gift Related Telugu News,Photos/Pics,Images..