సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?  

Solo Brathuke So Better Movie To Release In October, Solo Brathuke So Better, Sai Dharam Tej, Subbu, Tollywood News - Telugu Sai Dharam Tej, Solo Brathuke So Better, Subbu, Tollywood News

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.కేవలం కొన్ని రోజుల షూటింగ్ మిగిలి ఉన్న ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

 Solo Brathuke So Better Movie To Release In October

కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా వాయిదా పడింది.ఇక థియేటర్లు తెరుచుకున్న తరువాతే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పటికే పలు ఓటీటీలు ఈ సినిమాకు అదిరిపోయే ఆఫర్లు ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ డేట్ ఫిక్స్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాను ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అంగీకరంచినట్లు తెలుస్తోంది.ఓ భారీ ఆఫర్‌కు ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో సదరు ఓటీటీ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర వర్గాల టాక్.
మిగిలి ఉన్న కొంతమేర షూటింగ్‌ను ముగించేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా సుబ్బు అనే డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

#SoloBrathuke #Subbu #Sai Dharam Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Solo Brathuke So Better Movie To Release In October Related Telugu News,Photos/Pics,Images..