సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న సాయి తేజ్....  

Solo Brathuke So Better movie release date fixed - Telugu Director Subbu Movie News, Nabha Natesh, Sai Tej Movie News, Solo Brathuke So Better, , Tollywood

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి చిత్రం సోలో బ్రతుకే సో బెటర్.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.

Solo Brathuke So Better Movie Release Date Fixed

అయితే ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ నభా నటేశ్ నటిస్తోంది.ఈ చిత్రం చాలా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది.

అయితే తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని మే 1వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.అంతేగాక ఈ విషయం గురించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

అంతేగాక ఈనెల 13వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించినటువంటి వీడియోని సాయంత్రం 5 గంటల సమయంలో విడుదల చేస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు.దీంతో సాయి ధరంతేజ్ అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి.

అయితే ఇప్పటికే చిత్రంలోని దాదాపు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో సాయి తేజ్ నటించినటువంటి ప్రతి రోజు పండగే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేగాక దర్శకనిర్మాతలకి కూడా కలెక్షన్ల పరంగా లాభాల పంట పండించింది.అయితే సాయి తేజ్ కూడా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని ఎంతగానో శ్రమిస్తున్నాడు.

#Nabha Natesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Solo Brathuke So Better Movie Release Date Fixed Related Telugu News,Photos/Pics,Images..