పే పర్‌ వ్యూ పేరుతో మెగా హీరో తప్పులో కాలేయ్యబోతున్నాడా?

హాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఓటీటీ మరియు పే పర్‌ వ్యూ పద్దతిలో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లో సినిమాలు విడుదల చేశారు.ఆ పద్దతులు ఇండియాలో కూడా మొదలు అయ్యాయి.

 Sai Dharam Tej Planning To Release Solo Bathuke So Better In Pay Per View, Solo-TeluguStop.com

ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.అయితే ఇప్పటి వరకు వర్మ సినిమాలు మరియు కొన్ని ఇతర సినిమాలు మాత్రమే పే పర్‌ వ్యూ పద్దతిలో విడుదల అయ్యాయి.

ఇన్ని రోజులు ఓటీటీల సబ్స్క్రిప్షన్‌ తీసుకుంటే అందులో వచ్చే కొత్త సినిమాలు అన్ని కూడా చూడవచ్చు.కాని ఇప్పుడు పేపర్‌ వ్యూ పద్దతిలో సినిమాను చూడాలంటే మళ్లీ ప్రత్యేకంగా టికెట్‌ తీసుకున్నట్లుగా కొంత మొత్తంను చెల్లించాల్సి ఉంటుంది.

అప్పుడు సినిమా వ్యూ అవుతుంది.అది కొన్ని గంటల వరకు ఉంటుంది.

ఆ తర్వాత చూడాలన్నా మళ్లీ ఉండదు.
ఇప్పుడు అదే పద్దతిలో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమా విడుదల కాబోతుంది.

ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ప్రముఖ ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.వారు పే పర్‌ వ్యూ ద్వారా సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.టికెట్‌ రేటును బట్టి ప్రేక్షకులు చూసేది లేనిది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.50 నుండి 100 వరకు ఉంటే పర్వాలేదు కొందరు చూసేందుకు ఆసక్తి చూపించారు.కాని రెండు మూడు రోజుల తర్వాత ఫ్రీగా లభించే సినిమాను ఎందుకు హడావుడిగా చూడాలి అంటూ కొందరు అనుకునే అవకాశం ఉంది.

కనుక పే పర్‌ వ్యూ పద్దతిలో తెలుగు సినిమా విడుదల చేయడం అది కూడా చిన్న హీరో సినిమాను అలా విడుదల చేయడం కాస్త ఆలోచించాల్సిన విషయమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఈ పద్దతిలో నిర్మాతకు నేరుగా లాభాలు వస్తాయి అంటున్నారు.

అయితే అది ఎంత వరకు సాధ్యం అనేది సినిమా విడుదల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube