ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచిన టాయ్ లెట్, ఎత్తుకెళ్లిన దొంగలు!  

Solid Gold Toilet Stolen From Blenhim Palace-oxfird Shire,police Complaint,solid Gold Toilet

ఎగ్జిబిషన్ లో టాయ్ లెట్ ని ప్రదర్సనకు పెట్టడం ఏంటి,దానిని మళ్లీ దొంగలు ఎత్తుకెళ్ళడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.వివరంగా విషయం తెలుసుకోండి అప్పుడు మీకే అర్ధం అవుతుంది.ఇంతకీ అది మామూలు టాయ్ లెట్ కాదులేండి అది బంగారు టాయ్ లెట్.

Solid Gold Toilet Stolen From Blenhim Palace-oxfird Shire,police Complaint,solid Gold Toilet-Solid Gold Toilet Stolen From Blenhim Palace-Oxfird Shire Police Complaint

అందుకే దొంగలు ఇంత కూడా సిగ్గుపడకుండా దానిని దొంగతనం చేసుకొని వెళ్లిపోయారు.ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ షైర్ లోని వుడ్ స్టాక్ లో ఉన్న బ్లెన్ హెయిమ్ ప్యాలెస్ లో ఎగ్జిబిషన్ ను నిర్వహించారు.ఈ ఎగ్జిబిషన్ లో భాగంగా ఆర్టిస్ట్ మారీజియో కాట్టేలాన్ పూర్తిగా 18 క్యారెట్ల బంగారు టాయ్ లెట్ ని తయారు చేసి ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు ఉంచారు.అయితే ఈ ప్రదర్శన కోసం భారీ గా సందర్శకులు రావడం తో ఎలా జరిగిందో గాని దొంగలు ఈ టాయ్ లెట్ ని అక్కడ నుంచి దొంగిలించుకొని వెళ్లిపోయారు.

Solid Gold Toilet Stolen From Blenhim Palace-oxfird Shire,police Complaint,solid Gold Toilet-Solid Gold Toilet Stolen From Blenhim Palace-Oxfird Shire Police Complaint

అయితే భారీ గా సందర్శకులు ఈ ఎగ్జిబిషన్ కు రావడం తో దొంగలు ఇంత ఈజీ గా ఆ బంగారు టాయ్ లెట్ ని ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు భావిస్తున్నారు.అయితే ఇప్పటివరకు కూడా అసలు ఆ దొంగతనం చేసింది ఎవరు అన్న దానిపై అధికారులు ఇంకా ఒక నిర్ధారణకు రాలేదు.

అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక 66 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ చోరీ కారణంగా ఆ ప్రాంతంలో ఇంకా చాలా వస్తువులు కూడా పాడైనట్లు అధికారులు చెబుతున్నారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.