ఇంటికో జవాన్.. ఆ ఊరంతా ప్రభుత్వ ఆఫీసర్లే..! ఎక్కడో తెలుసా..?!

ఇంట్లో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటేనే అదొక గొప్ప విషయం.కానీ ఆ ఊరంతా ప్రభుత్వ అధికారులే అయితే.? అందరూ ఐఏఎస్, పీసీఎస్ క్యాడర్ కు చెందిన వారే అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఉహించుకోండి.అదిరిపోయింది కదా.ఆ గ్రామం పేరే మధోపట్టి.ఈ విలేజ్ ఏం పుణ్యం చేసుకుందే ఏమో గాని ఊరంతా ఆఫీసర్లే.

 Soldier From Each House Officers Village Of India Madhopatti In Uttarpradesh , O-TeluguStop.com

అదృష్టవంతులకి పట్టిందల్లా బంగారం అయినట్టు ఈ ఊర్లో పుట్టారంటే అధికారి అవ్వాల్సిందే.నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

గ్రామంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎంతో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు.అంతేకాకుండా ప్రతీ ఇంటికి ఓ జవాన్ తప్పకుండా ఉంటాడు.

ఈ గ్రామానికి ‘విలేజ్ అఫ్ జవాన్స్‘ అనే పేరు కూడా ఉంది.ఆ ఊర్లో పుట్టిన వారే కాదు.

ఆ గ్రామానికి కోడలుగా వెళ్లిన వాళ్ళును కూడా అదృష్టం వరించింది.ఈ గ్రామం ఎక్కడుంది.? ఇంకా ఈ ఊర్లో ఏమైనా విశేషాలు ఉన్నాయా.? అసలు ఈ విలేజ్ కథ ఏంటో చదివేద్దాం రండి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జాన్పూర్ జిల్లాలోని మధోపట్టి అనే గ్రామం 75 ఏళ్లుగా ఐపీఎస్, పీసీఎస్ క్యాడర్ అధికారులను అందిస్తుంది.మధోపట్టి గ్రామంలో ముస్తఫా హుస్సేన్ అనే వ్యక్తి తొలి సరిగా 1914లో ఐఏఎస్ సాధించారు.

తరువాత 1952లో ఇందూ ప్రకాష్ అనే ఆఫీసర్ వల్ల రెండో స్థానం దక్కింది.ఇంకో విషయం ఏంటి అంటే.? ఆ గ్రామంలోని ఒకే ఇంట్లో నలుగురు ఐఏఎస్ సాధించి రికార్డ్ కొట్టారు.

Telugu Ias, Officers, Officers India, Soldier, Uttarpradesh, Latest-Latest News

1955లో వినయ్ కుమార్ సివిల్ సర్వీసెస్ సాధించగా.అతని ఇద్దరు తమ్ముల్లైనా ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్ 1964లో ఐఏఎస్ సాధించారు.నాలుగో తమ్ముడు 1968లో సాధించాడు వినయ్ కుమార్ ప్రస్తుతం బీహార్ కు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు.

అంతేకాకుండా గ్రామంలోని కొంతమంది యువత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో చేరితే మరికొందరు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో చేరిపోతుంటారు.కానీ ఇంతమంది అధికారులను ఇచ్చిన ఈ గ్రామానికి ఇంకా విద్యుత్ సదుపాయం సరిగా లేకపోవడం కొస మెరుగు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube