బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోముగింపుకు మరో 19 రోజులు మాత్రమే ఉంది.రోజులు గడిచే కొద్దీ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అవుతారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.
చాలామంది అభిజిత్ విన్నర్ అవుతాడని చెబుతున్నా బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చని.విన్నర్ కావడానికి అందరు కంటెస్టెంట్లకు అవకాశాలు ఉన్నాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
అయితే సోహెల్ ఫ్యాన్స్ మాత్రం అభిజిత్ విన్నర్ కాడని సోహెల్ విన్నర్ అవుతాడని అభిప్రాయపడుతున్నారు.
ఒక సెంటిమెంట్ ప్రకారం అభిజిత్ కంటే సోహెల్ విన్నర్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో శివబాలాజీ విన్నర్ కాగా సీజన్ 2 లో కౌశల్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో విన్నర్లుగా నిలిచారు.అయితే ఈ ముగ్గురిలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే ఈ ముగ్గురికీ కోపం చాలా ఎక్కువ.
ఆ కోపమే వీళ్లకు ప్లస్ కావడంతో పాటు బిగ్ బాస్ షో విన్నర్లు కావడానికి కారణమైందని సోహెల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని సోహెల్ తన కోపం ద్వారానే బిగ్ బాస్ హౌస్ లో పాపులర్ అయ్యారు.నాగార్జున సూచనల మేరకు గత కొన్నిరోజుల నుంచి సోహెల్ గతంతో పోలిస్తే కోపం తగ్గించుకున్నారు.అయితే గత సీజన్లలో ఎక్కువ కోపం ఉన్న కంటెస్టెంట్లు విన్నర్లు కావడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ సీజన్ లో సోహెల్ విన్నర్ అవుతాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
మరి సెంటిమెంట్ ప్రకారం సోహెల్ బిగ్ బాస్ విన్నర్ అవుతారో లేక అభిజిత్ లేదా మరో కంటెస్టెంట్ బిగ్ బాస్ విన్నర్ అవుతారో చూడాల్సి ఉంది.ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.