అఖిల్‌, సోహెల్‌లు తమను తామే దిగజార్చుకున్నారు

తెలుగు బిగ్‌బాస్‌లో ఇన్ని రోజుల నుండి అఖిల్‌ అంటే ప్రేక్షకులకు అభిమానం ఉండేది.కాని ఆయనపై అభిమానం మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నట్లుగా అనిపిస్తుంది.

 Sohel And Akhil Graph Following Down In Bigg Boss 4,  Abhijith, Akhil, Bb4, Naga-TeluguStop.com

ఆయన అనవసర విషయాలకు అతిగా స్పందిస్తున్నారు.సీక్రెట్‌ రూంలోకి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న వారు మాట్లాడుకునే మాటలను విన్న అఖిల్‌ బయటకు వచ్చిన తర్వాత ఆ విషయాన్నే పదే పదే తీసుకు వస్తున్నాడు.

అభిజిత్‌ ను టార్గెట్‌ చేసి ప్రేక్షకుల ముందు బ్యాడ్‌ చేసే విషయమై అఖిల్‌ ఫోకస్ పెట్టినట్లుగా అనిపించింది.అఖిల్‌ ఏమాత్రం సహనంతో వ్యవహరించడం లేదు.

సీక్రెట్‌ రూంలో ఉన్న సమయంలో అభిజిత్‌ వ్యవహరించిన తీరును ప్రేక్షకులు చూసుకుంటారు అనుకుని వదిలేసి మామూలుగా ఉన్నట్లయితే బాగుండేది.కాని తనకు తానే పదే పదే ఆ విషయాన్ని గుర్తు చేయడం తానో గొప్ప ప్లేయర్‌ అన్నట్లుగా భావించడం జరుగుతుంది.

Telugu Abhijith, Akhil, Nagarjuna, Sohel, Sohel Akhil-Latest News - Telugu

బిగ్‌బాస్ ఆదేశాల మేరకు నిన్నటి ఎలిమినేషన్‌ పక్రియను ప్రారంభించిన అఖిల్‌ కాస్త ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యాడు.తనను బిగ్‌బాస్‌ పులిని చేసి పంపించాడు అంటూ అఖిల్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.మేక పులి అవ్వదు బాబు బలి అవుతుంది అంటూ అభిజిత్‌ వేసిన పంచ్‌ డైలాగ్‌ మరింతగా ట్రెండ్ అవుతుంది.మొత్తానికి బిగ్‌ బాస్‌ ప్రేక్షకుల్లో అఖిల్‌ పట్ల మెల్లగా వ్యతిరేకత ప్రారంభం అవుతుంది.

ఇలాగే కొనసాగితే టాప్‌ 5కి వెళ్లలేవు అంటున్నారు.ఇక సోహెల్‌ కూడా మంచి ఎంటర్‌టైనర్‌ అని పేరు తెచ్చుకున్నవాడు తనకు తానే తన గ్రాఫ్‌ ను తగ్గించుకుంటున్నాడు.

మెహబూబ్‌ వెళ్లి పోయిన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు మరియు హారిక విషయంలో మాట్లాడిన తీరు అస్సలు బాగాలేదు అంటున్నారు.మొత్తానికి వీరిద్దరు పోయేకాలం వచ్చిందా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube