అనిల్ రావిపూడితో సోహెల్ చర్చలు.. ఇది మాములు లక్ కాదుగా?

బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ పరిచయం గురించి బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ తెలిసిందే.నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఎంతలా కనెక్ట్ చేసిందో.

 Sohail Talks With Anil Ravipudi That It Is Not Ordinary Luck-TeluguStop.com

అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లకు కూడా కొంతవరకు మంచి మంచి అవకాశాలను అందించాయి.ఇదిలా ఉంటే సోహెల్ ఇందులో ఎంత రచ్చ చేశాడో చూసాం.

చివరి వరకు తన ఆటతో, మాటతో మంచి గుర్తింపు అందుకొని అభిమానులను కూడా పెంచుకున్నాడు.

 Sohail Talks With Anil Ravipudi That It Is Not Ordinary Luck-అనిల్ రావిపూడితో సోహెల్ చర్చలు.. ఇది మాములు లక్ కాదుగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏ విషయంలోనైనా ఫేస్ టు ఫేస్ అన్నట్లు ఉంటాడు సోహెల్.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ తనతో పాటు మరో పలువురు కంటెస్టెంట్స్ అరియానా, హారిక లతో బాగా సందడి చేస్తుంటాడు.వారితో దిగిన ఫోటోలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటాడు.

ఇక సోహెల్ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇదంతా ఇలా ఉంటే సోహెల్ తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ను కలిసి చర్చలు చేస్తున్నట్లు తెలిసింది.

బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ సమయంలో అనిల్ రావిపూడి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా సందడి చేశాడు.చివర్లో టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్ లతో కాసేపు ముచ్చటించాడు.

అంతే కాకుండా సోహెల్ తో కథ వేరే ఉంటది అంటూ ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక సోహెల్ కూడా డీల్ ఏమి కుదుర్చుకోను.మీ సినిమాలో ఛాన్స్ ఇస్తే చాలు అని అనిల్ రావిపూడి తో కాసేపు సరదాగా మాట్లాడాడు.

Telugu Anil Ravipudi, Instagram, Ordinary Luck, Sohail-Movie

ఇక తాజాగా సోహెల్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో అనిల్ రావిపూడి తో కనిపించాడు.ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో బహుశా సోహెల్ అనిల్ రావిపూడి తో ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడా అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక సోహెల్ నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ.

జీరో యాటిట్యూడ్, ఎంతో మంచి మనిషి, ఎంతో ఇంటిలిజెంట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ని కలిసే ఛాన్స్ వచ్చిందని, ఇది మామూలు లక్ కాదని తెలిపాడు.

ఫ్రెండ్లీ గా, సాధారణంగా కలిసానని తెలిపారు.

బిగ్ బాస్ రోజులను గుర్తుకు చేసుకున్నామని, తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నామని ఇక ఆయన ఇచ్చిన సలహాలను ఎప్పటికీ మర్చిపోనని తెలిపాడు.ఇక అనిల్ రావిపూడి ని ఫాలో అవుతానంటూ.

ఆయన సమయాన్ని తన కోసం కేటాయించినందుకు థాంక్స్ అంటూ మళ్లీ ఆయనను కలిసేందుకు ఎదురుచూస్తున్నాను సార్ అంటూ పోస్ట్ చేశాడు.

#Ordinary Luck #Instagram #Anil Ravipudi #Sohail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు