సొహెల్ సినిమా మొదలైంది.. మరి చిరు ఏమంటాడో..?!

ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే అన్ని అవకాశాలు ఒకేసారి కలిసి వచ్చేస్తాయి.ఇలా అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలని అందరూ అంటూ ఉంటారు.

 Bigg Boss, Sohel, Chiru, New Movie, Producer Appi Reddy, Srinivas, Producer Appy-TeluguStop.com

బుల్లితెరపై ఒక ఊపు ఊపిన రియాల్టీ షో బిగ్ బాస్ 4 సీజన్ మొత్తానికి అభిమానుల మనసులు దోచుకున్న సోహెల్ కు అదృష్టం కలిసి వచ్చింది.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ముందే సోహెల్ కొన్ని సినిమాలలో పాత్రలు చేసినా కూడా ఎవరు గుర్తించలేదు.

ప్రస్తుతం సొహెల్ కు హీరోగా మంచి అవకాశాలు వస్తున్నాయి.అంతేకాకుండా హీరోగా సోహెల్ ఒక కొత్త సినిమాను కూడా ప్రారంభం అయిపోయింది.

ఇక ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకొని వచ్చిన అప్పి రెడ్డి నిర్మించబోతున్నాడు.

తాజాగా ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి తన మూడో సినిమాను సోహెల్ తో తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

అలాగే ఈ సినిమాకు ఓ కొత్త దర్శకుడు శ్రీనివాస్ విజనంపాటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ అప్పి రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా సబ్జెక్టు ఒక సెన్సేషన్ సృష్టిస్తున్నా, నాకు తెలిసి ఇండియాలో ఇటువంటి కాన్సెప్ట్ సినిమా ఇంకా రాలేదని, అలాగే హీరోగా నటిస్తున్న సోహెల్ తో మేము బిగ్ బాస్ వెళ్లే కంటే ముందే మాట్లాడమని, బిగ్ బాస్ అనంతరం సోహెల్ ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితుడు అయిపోయాడు.

తీయబోయే సినిమా ఇది ఒక మంచి చేంజ్ గేమ్ అవుతుంది అని ఆయన తెలియచేశాడు.

Telugu Bigg Boss, Chiru, Appi Reddy, Sohel, Srinivas-Latest News - Telugu

ఇక ఈ విషయాన్ని గమనిస్తే సోహెల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకు మునుపే అప్పి రెడ్డి ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.ఇక మరోవైపు ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ.నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందుకు కొన్ని సినిమాలలో నటించాను కానీ నాకు అవి పెద్దగా గుర్తింపును సొంతం చేసుకోలేక పోయాను, కానీ హౌస్ లో నుంచి బయటికి రాగానే అభిమానులు అందరూ నేను ఎలాంటి సినిమాలను చేస్తాను అని ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా కథ కాస్త వెరైటీగా ఉంటుందని, నాకు ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ సోహెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ ఫైనల్ లో స్టేజీపై మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాటకి అనుగుణంగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో చిరు నటిస్తారా.? లేదా…? అన్న సందేహం ఉంది.అంతేకాకుండా దర్శకుడు కూడా చిరంజీవి కోసం ఒక మంచి క్యారెక్టర్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ విషయం సంబంధించి చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube