బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోహెల్..!!  

sohail,big boss,nagarjuna,abhijeeth, Abhijith, Bigg Boss Telugu s4, Mehaboob, Akhil, Monal, Donation For Poor People - Telugu Abhijeeth, Big Boss, Nagarjuna, Sohail

బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫోర్ లో టైటిల్ విన్నర్ అభిజిత్ గెలిచినా గాని బయట పాపులారిటీ, క్రేజ్ ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్ సోహెల్ అని అందరూ అంటున్నారు.హౌస్ లో ఎలాంటి విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టు, మనసులో ఏది దాచకుండా మొహం మీద చెబుతూ జెన్యూన్ గేమ్ ఆడి మూడో ప్లేస్ లో నిలిచిన సోహెల్.

TeluguStop.com - Sohail Keeps His Word In Bigg Boss House

అప్పట్లో పాతిక లక్షల గెలవటం అందరికీ తెలిసిందే.అయితే అంతకుముందు హౌస్ లో ఒకానొక సమయంలో ప్రైజ్ మనీ గెలిస్తే.

బయట ఏం చేస్తారు అని బిగ్ బాస్ అడిగిన ప్రశ్నకు.సోహైల్ సమాధానం ఇస్తూ అనాధలకు 10లక్షల సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది.

TeluguStop.com - బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోహెల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన మాటను హౌస్ నుండి బయటకు వచ్చిన సోహెల్ నిలబెట్టుకున్నాడు.ఇటీవల 10 లక్షల చెక్కుల రూపంలో పలు స్వచ్ఛంద సంస్థలతో పాటు సేవా ఆశ్రమాలకు సహాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోహెల్ మాట్లాడుతూ.బిగ్ బాస్ తన లో చాలా మార్పులు తీసుకు వచ్చిందని చెప్పుకొచ్చాడు.తాను హౌస్ లో గెలిస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే ఇవ్వటం జరిగిందని క్లారిటీ ఇచ్చాడు.

అంతేకాకుండా రాబోయే రోజుల్లో సినిమాలో వచ్చే ప్రతి రెమ్యూనరేషన్ లో 10 నుంచి 15 శాతం వరకు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ అని మాట ఇచ్చాడు.

అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలతో పాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఒక కుటుంబానికి 10 లక్షల కూడా ఇవ్వటం గమనార్హం.ఈ సందర్భంగా బయట యువత కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అనాధలకు సహాయం చేయాలని సోహెల్ పిలుపునిచ్చాడు.

అదేవిధంగా ప్రైజ్ మనీ విషయంలో హెల్ప్ చేసిన నాగార్జున గారికి స్పెషల్ థాంక్స్ తెలిపాడు.నాగార్జునగారు ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని సోహెల్ పొగడ్తలతో ముంచెత్తాడు.

#Big Boss #Nagarjuna #Sohail #Abhijeeth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు