అదేంటీ.. బంగార్రాజును ఇంత సింపుల్‌ గా కానిచ్చేశారు?

నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది.ఆ సినిమాకు అప్పటి నుండి ఇప్పటి వరకు సీక్వెల్‌ లేదా ప్రీక్వెల్‌ గా బంగ్రారాజు అనే సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

 Soggade Chinninayana Bangarraju Movie Shooting Started In Annapurna Studio, Naga-TeluguStop.com

సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో బంగార్రాజు పాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది.కనుక ఆ పాత్రను బేస్ చేసుకుని సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా నాగార్జున మొదటి నుండి అన్నాడు.

అన్నట్లుగానే బంగార్రాజు సినిమా కోసం కథ రాస్తున్నట్లుగా కళ్యాణ్‌ కృష్ణ అన్నాడు.అయితే ఏళ్లకు ఏళ్లు దాటి పోయినా కూడా సినిమా షూటింగ్ ప్రారంభం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

బంగార్రాజు సినిమా షూటింగ్ విషయంలో యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది.

నేటి నుండి అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.ఆ విషయం చాలా సైలెంట్ గా రివీల్ చేశారు.

సినిమా షూటింగ్‌ ప్రారంభం విషయంలో ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి.ఈ సారి నిజంగానే సినిమా పట్టాలెక్కినా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.

అసలు సినిమా చిత్రీకరణ ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బంగార్రాజు సినిమాను అన్నపూర్ణ స్టూడియోలో ఎలాంటి హడావుడి లేకుండా మొదలు పెట్టారు.

సైలెంట్‌ గా సినిమాను మొదలు పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అనేది మాత్రం తెలియడం లేదు.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ సినిమాలో ఏమైనా ఇతర అక్కినేని హీరోలు నటిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Telugu Bangarraju, Kalyan Krishna, Lavanya Tripati, Nagarjuna, Soggadechinni, Te .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube