సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ షూటింగ్ డేట్ రిలీజ్! జులైలో ప్రారంభం  

సోగ్గాడే చిన్ని నాయనా మూవీ సీక్వెల్ కి జులైలో ముహూర్తం ఫిక్స్ చేసిన నాగార్జున..

Soggade Chinni Nayana Movie Sequel Going To Shoot In July-

అక్కినేని నాగార్జున కెరియర్ లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయిన మూవీ సోగ్గాడే చిన్ని నాయనా.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో నాగార్జున డబల్ రోల్ చేసాడు.అందులో ఒకటి బగార్రాజు పాత్ర..

Soggade Chinni Nayana Movie Sequel Going To Shoot In July--Soggade Chinni Nayana Movie Sequel Going To Shoot In July-

నిజానికి సినిమా అంతా బగార్రాజు పాత్ర చుట్టూనే తిరుగుతుంది.ఇక ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా బంగార్రాజు టైటిల్ ని నాగ్ అప్పట్లోనే రిజిస్టర్ చేయించాడు.ఇక తరువాత కళ్యాణ్ కృష్ణ అక్కినేని ఫ్యామిలీ కి రారండోయ్ వేడుక చేద్దాం సినిమాతో మరో హిట్ ఇచ్చాడు.

అయితే ఆ తరువాత రవితేజ డేట్స్ సంపాదించి నేల టికెట్ అనే సినిమా తీసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.దీంతో నాగార్జున అతనిపై పెద్దగా నమ్మకం చూపించలేదు.అయితే బంగార్రాజు కథని సిద్ధం చేసి నాగ్ కి వినిపించడం ఆ సినిమా కథ నాగార్జునకి నచ్చడంతో దానిని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాని జులై నెలలో సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నాగార్జున సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.మరి ఈ సీక్వెల్ బంగార్రాజుతో నాగ్ మళ్ళీ ఎ మేరకు సూపర్ హిట్ కొడతాడు అనేది వేచి చూడాలి.