ఆదర్శం : విప్రోలో జాబ్‌ వదిలేసి ఏం చేశాడో చూడండి... పనేదో చూడకుండా తృప్తినిచ్చేది చేయాలి  

Softwere Employee Turns Into A Successful Farmer Natu Kodi Farming-shiva Sai Charan,softwere Employee,wipro Company

లక్షల జీతం వస్తున్నా కూడా కొన్ని సార్లు చేస్తున్న ఉద్యోగం విషయంలో తృప్తి పడని వారు ఎంతో మంది ఉంటారు. ఉద్యోగం కోసం బయట ఎంతో మంది పిచ్చి వారిలా తిరుగుతూ ఉంటారు. కాని వారు కూడా ఉద్యోగం వచ్చిన కొన్నాళ్లకే అబ్బా ఏంటీ ఈ బోరింగ్‌ ఉద్యోగం అనుకుంటారు...

ఆదర్శం : విప్రోలో జాబ్‌ వదిలేసి ఏం చేశాడో చూడండి... పనేదో చూడకుండా తృప్తినిచ్చేది చేయాలి-Softwere Employee Turns Into A Successful Farmer Natu Kodi Farming

ఒక ప్రముఖ ఆన్‌ లైన్‌ సంస్థ ఇండియాతో పాటు పలు దేశాల్లో చేసిన సర్వే ప్రకారం 75 శాతం మంది ఉద్యోగస్తులు తాము చేస్తున్న ఉద్యోగంపై, కంపెనీపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొందరు ఇష్టం లేకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు. శివసాయి చరణ్‌ వంటి వారు మాత్రం ఆసక్తిలేని రంగంను వదిలేసి, ఏ రంగంలో ఆసక్తి ఉందో అక్కడకు వెళ్తారు.

ఎవరు ఈ శివసాయి చరణ్‌.

ఇలా లైఫ్‌ చాలా హ్యాపీగా సాగించే అవకాశం ఉన్నా కూడా చరణ్‌కు మాత్రం ఇంకా ఏదో చేయాలనే తపన మొదలైంది. అందుకే విప్రోలో జాబ్‌ వదిలేశాడు. ప్రముఖ విప్రోలో జాబ్‌ వదిలేయడంతో అంతా కూడా చివాట్లు పెట్టారు.

జాబ్‌ మానేసి ఏం చేద్దామని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు కూడా మొదట అడ్డు చెప్పినా కూడా ఆ తర్వాత నీ ఇష్టానుసారంగానే చేయి అంటూ పూర్తి స్వేచ్చను ఇచ్చారు.

జాబ్‌ మానేసిన చరణ్‌ తన తండ్రికి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అప్పటి వరకు తాను కూడబెట్టిన డబ్బుకు తోడుగా కొంత మొత్తంలో లోన్‌ తీసుకుని మొత్తంగా 20 లక్షల రూపాయలతో నాటు కోడి ఫామ్‌ ను నిర్మించాడు. ఇక తమిళనాడు నుండి రెండు వేల పిల్లలను తీసుకు వచ్చి పెంచడం ప్రారంభించాడు.

అందుకు గాను అయిదు లక్షల రూపాయల ఖర్చు వచ్చింది. రెండు వేల పిల్లలు గత నాలుగు నెలలుగా పెంచుతున్నాడు. ఇప్పుడు కోళ్లు సరాసరిగా రెండు కేజీలకు ఎక్కువ బరువు అయ్యాయి...

మార్కెట్‌లో నాటు కోడి కేజీ 200 రూపాయలకు ఎక్కువగానే పలుకుతుంది. అయితే చరణ్‌ మాత్రం రెండు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు.

ఈ చొప్పున చూసుకున్నా చరణ్‌ కు మొదటి విడతలోనే దాదాపుగా 7 లక్షల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 5 లక్షలు పెట్టుబడి పోతే రెండు లక్షలు మిగలనున్నాయి. మొదటి బ్యాచ్‌ కనుక అనుభవం లేమితో కాస్త లాభాలు తగ్గాయి కాని తర్వాత బ్యాచ్‌ నుండి తను గతంలో చేసిన తప్పులను సరిద్దిది మంచి లాభాలను దక్కించుకుంటాను అంటూ సాయి చరణ్‌ నమ్మకంగా చెబుతున్నాడు. ఉద్యోగం లేదని బాధపడే వారికి సాయి చరణ్‌ మంచి ఆదర్శనీయుడు.

ఇలాంటి అవకాశం మీకు చిన్నది ఉన్నా వెంటనే అమలు చేసేయండి.