టీచర్ బోర్డు మీద అలా రాయమనేసరికి ఆ యువతి కంటతడి పెట్టుకుంది.! ప్రతిఒక్కరు తప్పక తెలుసుకోండి.!

భార్యా , భర్తలిద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు .ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఆఫీస్ కు వెళ్లారు.

 Softwaretrainer About Wife And Husband Relation-TeluguStop.com

అదే రోజు ఆఫీస్ లో ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ను ఏర్పాటు చేశారు ఆఫీస్ నిర్వాహకులు.అందులో ఈ దంపతులు కూడా పాల్గొన్నారు.

ట్రైనర్ వచ్చాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ స్టార్ట్ చేశాడు…ప్రాక్టికల్ గా ఏదో చెప్పాలనుకున్నాడు.భార్య భర్తల్లో ఒకరిని రమ్మనాడు.

భార్య వెళ్లింది.ఆమె చేతికి చాక్ పీస్ ఇచ్చి మీకు బాగా ఇష్టం అయిన 30 పేర్లను బోర్డు మీద రాయమన్నాడు.

వెంటనే తనకు కావాల్సిన వాళ్లను, ఫ్రెండ్స్ ను గుర్తుకుతెచ్చుకొని టపా,టపా ఓ 30 పేర్లను బోర్డు మీద రాసేసింది.

గుడ్ ఇప్పుడు రాసిన వాటి నుండి ఓ 20 పేర్లను తొలగించండి అని అన్నాడు ట్రైనర్.

అప్పుడు ఆమె ఆలోచించి తనకు అంతగా అవసరం లేరు అనుకున్న వారి పేర్లను తుడిచేసింది.మళ్లీ ఓ ఆరు పేర్లను తుడిచేయండి అని అన్నాడు ట్రైనర్ ఆ సారి బాగా ఆలోచించి ఆరు పేర్లను తుడిచేసింది.

ఈ సారి మిగిలిన నాలుగు నేమ్స్ లో రెండిటిని తీసేయండి అన్నాడు.చాలా బాధగా తన తల్లిదండ్రుల పేరును డిలేట్ చేసింది ఆ ఉద్యోగిని.ఇప్పుడు మిగిలిన రెండు పేర్లలో ఒక పేరుని తీసేయండి అన్నాడు.అప్పుడు ఆమె రెండు చేతుల్లో ముఖాన్ని అడ్డుపెట్టుకొని ఎడవసాగింది….హు.తీసేయండి …ఒక పేరును అన్నాడు ట్రైనర్….అలాగే ఎడుస్తుంది.పాప పుట్టిన రోజు, ఆ పాపను అల్లారుముద్దుగా పెంచిన తీరు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి.అయినా సరే.అనుకొని తన 3 యేళ్ల పాప పేరును తుడిచేసింది.

బోర్డు మీద ఒకటే పేరు మిగిలింది… ఆ పేరు ఎవరిదో తెలుసా… కట్టుకున్న భర్తది.అప్పుడు చెప్పాడు ట్రైనర్ భార్య భర్తల అనుబంధం, అనురాగం అంటే ఇలాగే ఉంటుంది.

కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న పసిపాపను కాదని… భర్త పేరును అలాగే ఉంచింది ఎందుకంటే ….కడదాకా ఒకరికి ఒకరు తోడుగా ఉండేది వాళ్లిద్దరే అన్నాడు ట్రైనర్.
అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న హాల్ చప్పట్లతో మారుమోగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube