చీమల దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఎలా అంటే..!

ఆవిడ ఇంట్లో పుట్టలు పుట్టలుగా చీమలు వున్నాయి.ఆ చీమల్ని తరిమి వేయాలని భావించిన ఆవిడ చివరికి తన ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Software Engineer Who Lost His Life To Ant Attack How Is That, Software, Ants, F-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.చెన్నై నగరంలోని ఓ ప్రాంతంలో ఉన్న పెరుమాల్ గుడి వీధిలో ఉంటున్న సత్యమూర్తి దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు.

వీరికి కూతురు సంగీత ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుండే ఆవిడ పని చేస్తున్న నేపథ్యంలో ఆవిడ ఇంట్లో నుండే పనిచేస్తున్నారు.

అయితే వారి ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలకు చీమలు పట్టడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.దీంతో ఇంట్లో ఎటువైపు చూసినా చీమలు ఎక్కువగా ఉండటంతో ఆమెకు చికాకు వేసింది.

ఆ చీమల్ని ఇంటి నుంచిఎలా అయినా పంపించేయాలని భావనతో ఆ చీమల్ని చంపేయాలని ముందుగా వాటిపై తన తల్లి ఆలోచనతో కిరోసిన్ పోసి నిప్పు అంటించింది.దీంతో ఆ చీమలు ఇంటినిండా వెళ్లిపోవడంతో ఆ చీమలను ఎలాగైనా చంపేయాలని కిరోసిన్ మరింతగా వాటిపై పోసింది.

ఇక ఇందులో భాగంగానే ఆ మంట ఆవిడ బట్టలకు తగులుకొని పూర్తిగా ఆ మంటల్లో చిక్కుకుంది.పక్కనే ఉన్న ఆవిడ తల్లి కూడా ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నం చేసిన అప్పటికే ఆ అమ్మాయి పూర్తిగా కాలిపోయింది.

ఆమె కేకలకు పక్క గదిలో ఉన్న తండ్రి సోదరుడు వచ్చి రక్షించే ప్రయత్నం చేసిన చివరికి సంగీత ప్రాణాలు కోల్పోయింది.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కూతుర్ని కాపాడే ప్రయత్నంలో సంగీత తల్లికి కూడా చిన్న చిన్న గాయాలు అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube