తీసుకున్న అప్పు తీర్చలేక... చివరి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు.... 

అవసరం కోసం చేసినటువంటి  అప్పు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వ్యక్తి చెల్లించలేదని ఏకంగా ఆ వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 Software Employee Sunil Commits Suicide For Money Lenders Harassment, Sunil, Sof-TeluguStop.com

 ఈ క్రమంలో మృతుడు ఆత్మహత్య చేసుకోబోయే ముందు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ దుమారం రేపుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే సునీల్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని రంగా రెడ్డి జిల్లా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

 అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ ప్రముఖ ప్రైవేటు సాఫ్ట్ వేర్ సంస్థలో పని చేసేవాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఆర్థిక మాంద్యంతో ఉద్యోగం పోవడంతో గత కొద్ది నెలలుగా ఇంటి పట్టునే ఖాళీగా ఉంటున్నాడు.

 ఈ క్రమంలో కుటుంబ పోషణకు డబ్బు అవసరం కాగా  అవసరానికి అప్పులిచ్చేటువంటి కొన్ని ప్రవైట్ యాప్ ల ద్వారా దాదాపుగా 6 లక్షల రూపాయలను అప్పుగాతీసుకున్నాడు.దీంతో  తిరిగి చెల్లించే క్రమంలో కొంతమేర డబ్బు సర్దుబాటు కాకపోవడంతో  తన అప్పు తీర్చడానికి కాలం పాటు గడువు ఇవ్వాలని కోరాడు.

 అయినప్పటికీ కొంతమంది ఏజెంట్లు ఫోన్లు చేస్తూ డబ్బు కట్టాలని అంటూ బెదిరింపులకు పాల్పడుతుండేవారు.

ఈ క్రమంలో సునీల్ ఫోన్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు సునీల్ డబ్బు  తీసుకొని కట్టలేకపోయాడని మెసేజ్ లు  పంపించారు.

 దీంతో ఇతరుల నుంచి ఈ విషయం తెలుసుకున్న సునీల్తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడికి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్  కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు ఫోన్ వచ్చింది.

కానీ సునీల్ మాత్రం ప్రస్తుతం తానూ ఉన్నటువంటి పరిస్థుతులలో ఆ ఉద్యోగాన్ని చేయాలని ఇంకొకరికి ఇవ్వాలంటూ సంస్థ అధికారులకి సూచించాడు.

అనంతరం తన సొంత నివాసంలో ఉరేసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.

 దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతోంది. అంతేకాక సునీల్ ని డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసినటువంటి ఏజెంట్లను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

అంతేగాక అవసరాల్లో ఉన్నటువంటి వారిని అలుసుగా తీసుకుని అప్పులిచ్చి వడ్డెలా మీద వడ్డెలు వసూళ్లు చేస్తున్న యాప్ లను నిషేదించాలని కొందరు నెటిజన్లు పోలీసులను కోరుతున్నారు. అంతేగాక ఎలాంటి ఆర్బీఐ నిబంధనలను పాటించకుండా గుర్తింపు లేని సంస్థలు ప్రజలను దోచుకుంటున్నారని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఇలాంటి నిషేధించాలని సూచిస్తున్నారు.

తీసుకున్న అప్పు చెల్లించలేక సునీల్ కన్నుమూయడంతో సునీల్ భార్య మరియు ఆరు నెలల కూతురు ఒంటరి వాళ్ళయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube