అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి..మంచి జీతం.! సూసైడ్ కి ముందు రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లొస్తాయి!

నేడు ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.ధైర్యంగా ఉండాల్సిన యువత చిన్న చిన్న విషయాలకు ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు.

 Software Employee Suicide Note-TeluguStop.com

భాగ్యనగరంలో విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది.సాఫ్ట్ వేర్ ఇంజినీర్, మంచి జీతం ఉండి కూడా ప్రేమ విఫలం అయ్యింది అంటూ దారుణంగా ప్రాణాలు తీసుకున్న ఘటన బండ్లగూడలో జరిగింది.

ఈ యువకుడి తల్లిదండ్రుల ఆవేదన చూసేవారికి సైతం కన్నీళ్లు తెప్పించాయి.పూర్తి వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ బండ్లగూడకి చెందిన యతీష్.

విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.మంచి జీతం.

నాలుగేళ్లుగా ఓ అమ్మాయి ప్రేమలో ఉన్నాడు.ఇంట్లో వారికి కూడా చెప్పాడు.పెళ్లికి యతీష్ కుటుంబం కూడా ఓకే అన్నది.అయితే రెండు నెలల క్రితం అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది.ఈ విషయంపై నిలదీశాడు.పెళ్లికి ఇంట్లో వారు ఒప్పుకోవటం లేదని చెప్పింది ఆ అమ్మాయి.

ఇంట్లో వారు చూపించిన సంబంధమే చేసుకుంటానని.నా పెళ్లి నా చేతుల్లో లేదని చెప్పింది.

అయితే నెల రోజుల క్రితం మరోసారి వీళ్లిద్దరూ మరోసారి కలిశారు.మాట్లాడుకున్నారు.

ఈ సమయంలో మరో యువకుడి ప్రేమలో ఉన్నట్లు గుర్తించాడు.

ఆ అబ్బాయితో వెళ్లటం చూశాడు.

ఈ విషయంపై నిలదీశాడు.ఇంట్లో వాళ్లు చెప్పిన సంబంధం చేసుకునేటప్పుడు మరో అబ్బాయితో ఎలా తిరుగుతావ్.

నాలుగేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎందుకు మోసం చేశావ్ అని అమ్మాయిని నిలదీశాడు.ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

అమ్మాయి చేసిన మోసం.అన్న మాటలతో మనోవేదనకు గురైన యతీష్.బుధవారం రాత్రి.ఉప్పల్ HMDA లే-ఔట్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకుని మరీ చనిపోయాడు.

ఎందుకు చనిపోతున్నది లేఖలో వివరంగా రాశాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొడుకు మరణం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.ఎంతో కష్టపడి చదివించాం అని.మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడని అనుకున్నాం.ఇంత పని చేస్తాడు అనుకోలేదంటూ ఆ తల్లిదండ్రులు రోదన చూసేవారిని కన్నీళ్లు తెప్పించింది.

అమ్మాయి కోసం చనిపోయే ముందు.అమ్మానాన్న గుర్తుకు రాలేదా అంటూ ఆ తల్లి అనే మాటలకు అక్కడి వారు చలించిపోయారు.

తొందరపడ్డావు రా బిడ్డా అంటూ ఆ పేరంట్స్ మాటలు అక్కడి వారిని కదిలించేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube