అర్ధరాత్రి వరకు నా భార్య మేల్ ఫ్రెండ్ తో..విడాకులివ్వండి అంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆవేదన!       2018-06-29   22:27:15  IST  Raghu V

ఎంతో ఇష్టపడి కట్టుకున్న భార్యతో కాపురం చేయలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విడాకుల కోసం కోర్టుమెట్లెక్కాడు. తన భార్య అర్థరాత్రుళ్లు కూడా మేల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తోందని వాపోయాడు. పైగా, రేయింబవుళ్ళూ ఇంటర్నెట్‌లోనే గడుపుతోందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. వివరాలలోకి వెళ్తే..

ఢిల్లీకి చెందిన నరేంద్ర సింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. గతేడాదే పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచే అతడి కష్టాలు మొదలయ్యాయట. భార్య రోజూ ఇంటర్నెట్ వాడేస్తూ.. సోషల్ మీడియాలో బాగా బిజీ అయ్యిందంట. అర్థరాత్రి సమయంలోనూ కొంతమంది చాట్ చేయడాన్ని కూడా గమనించాడట. కొన్ని సందర్భాల్లో ఆమెను మందలించినా.. హెచ్చరించినా పద్దతి మార్చుకోలేదట. అలాగే తనను నిర్లక్ష్యం చేస్తుందనే ఫీలింగ్‌ అతడిలో వచ్చింది. అంతేకాదు ఈ విషయంలో దంపతులు గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయట.

చేసేదేంలేక టెకీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు. ఓ మీడియా సంస్థతోనూ తన ఆవేదనను పంచుకున్నాడట. పెళ్లయ్యాక అత్తవారింటి వాతావరణానికి తగ్గట్లుగా మారే అవకాశం టెకీ ఇవ్వలేదని, తన క్లైయింట్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇంజినీర్‌ భార్య తరఫు న్యాయవాది తెలిపారు. అయితే, ప్రస్తుతం సోషల్‌ మీడియాలాంటి వాటి వల్ల దంపతులు విడాకులు కోరడం ఆందోళన కలిగించే విషయమని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ హిమా కోహ్లీ వ్యాఖ్యానించడం గమనార్హం.