93 వేల ఫోన్‌ ఆర్డర్‌ ఇస్తే 9 వేల ఫోన్‌ వచ్చింది

ఆన్‌లైన్‌ అమ్మకాలు కొనుగోలు విపరీతంగా పెరిగిన వేళ మోసాలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి.ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు అసలువి వస్తాయా లేదంటే నకిలీవి వస్తాయా అనేది అర్థం అవ్వడం లేదు.

 Soft Weare Engineer Order The 93 Thousand Phone Flipcart Give The 9 Thousand Ph-TeluguStop.com

కాని తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయాల్సి వస్తుంది.తాజాగా బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 93 వేల రూపాయలు పెట్టి ఐఫోన్‌ 11 కొనుగోలు చేశాడు.

ఆ ఫోన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూశాడు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్‌ ఇచ్చిన కొన్ని రోజులకు ఆ ఫోన్‌ వచ్చింది.

వచ్చిన ఫోన్‌ను ఆశగా ఓపెన్‌ చేశాడు.చాలా సంతోషంగా ఆన్‌ చేశాడు.

ఆన్‌ చేయగానే అందులో ఆండ్రాయిడ్‌ ఆపరేటటింగ్‌ సిస్టం ఉండటం చూసి అవాక్కయ్యాడు.అలాగే వెనుక మూడు కెమెరాలను కూడా అతికించి ఉంచారు.

దాంతో వెంటనే ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేశాడు.వారు స్పందించి కొత్త ఫోన్‌ను పంపిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగిందట.

ఈ సంఘటనతో ఫోన్‌లు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాలంటేనే భయంగా ఉంది అంటూ నెటిజన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube