సెలబ్రెటీల సంపాదనని అంచనా వేయడం చాలా కష్టం.వారికి సినిమాల ద్వారా, అలాగే యాడ్స్ ద్వారా వందల కోట్ల రూపాయిలు ఆదాయం వస్తుంది.
ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది.హీరోయిన్స్ తో పోల్చుకుంటే హీరోలకి ఆదాయం ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళు రెమ్యునరేషన్ రూపంలో ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు.అయితే హాలీవుడ్ లో అయితే హీరోలతో సమానంగా హీరోయిన్స్ సంపాదన కూడా ఉంటుంది.
ఇండియాలో మాత్రం హీరో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ లో చాలా వ్యత్యాసం ఉంటుంది.ఇండియాలో అయితే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునే ఉన్నారు.
అయితే వీళ్ళ రెమ్యునరేషన్ హాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువనే చెప్పాలి.అక్కడా హీరోయిన్స్ ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ గా తీసుకుంటారు.
ప్రపంచంలో ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్న హీరోయిన్స్ జాబితాని ఫోర్బ్స్ తాజాగా రిలీజ్ చేసింది.ఈ లిస్ట్ ప్రకారం హయ్యస్ట్ పెయిడ్ నటిగా అమెరికన్ యాక్టర్ సోఫియా వెర్గర్ నిలిచింది.
గతేడాదిలో సోఫియా 43 మిలియన్ డాలర్లను ఆర్జించడం విశేషం.దీని విలువ ఇండియన్ కరెన్సీలో సుమారు 315 కోట్లు.
సోఫియా తర్వాత స్థానాల్లో హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ ఏంజెలీనా జోలి, గల్ గడోట్, మెలిస్సా మెకెర్తీ నిలిచారు. సోఫియా సంపాదనలో ఎక్కువ మొత్తం అమెరికాస్ గాట్ ట్యాలెంట్, మోడర్న్ ఫ్యామిలీతో కుదుర్చుకున్న ఎండార్స్మెంట్ల వలన వచ్చిందని తెలుస్తుంది.
అమెరికాస్ గాట్ ట్యాలెంట్లో ప్రతి ఎపిసోడ్కు సోఫియా 5 లక్షల డాలర్లను తీసుకుంటుందని తెలుస్తోంది.ఫోర్బ్స్ లో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న హీరోయిన్స్ జాబితాలో ఎవరికీ చోటు దక్కలేదు.
అయితే ఇండియన్ విమెన్ సెలబ్రెటీలు కూడా ఏడాదికి వందల కోట్లలోనే ఆదాయం ఆర్జిస్తున్నారని తెలుస్తుంది.