టీఆర్ఎస్ నేతని పొట్టన పెట్టుకున్న నక్సల్స్!  

Maoists Murdered Trs Leader In Khammam-

గత ఏడాది విశాఖలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములని మావోయిస్టులు కాల్చిన చంపినా ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.చాలా ఏళ్ల తర్వాత అలా రాజకీయ నాయకులని మావోలు లక్ష్యంగా చేసుకొని చంపేశారు.ఆ ఘటన తర్వాత మావోల మీద మరింత నిఘా పెట్టిన గ్రే హౌండ్స్ పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు ఎన్ కౌంటర్ చేసేసారు...

Maoists Murdered Trs Leader In Khammam--Maoists Murdered TRS Leader In Khammam-

కిడారి ని చంపినా గ్యాంగ్ లో అందరిని సుమారు ఎన్ కౌంటర్ లో గ్రే హౌండ్స్ దళాలు హతం చేసాయి.ఈ ఘటన మరువక ముందే తెలంగాణాలో మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది.

ఖమ్మ జిల్లాలో ఈనెల 8న మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నేత ఎన్.శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

Maoists Murdered Trs Leader In Khammam--Maoists Murdered TRS Leader In Khammam-

అయితే తరువాత అతడిని వదిలేసారు అనే వార్తలు వచ్చాయి.కానీ అతడు ఇంటికి రాకపోవడం పోలీసులు అతని ఆచూకి కోసం వెతుకుతూ ఉన్నారు.ఇంతలో ఊహించని విధంగా శ్రీనివాస్ మృతదేహం బయటపడింది.

శ్రీనివాసరావు పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందుకే అతడిని చంపినట్టు చర్ల శబరి ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో ఓ లేఖ కూడా మృతదేహం ఉన్న ప్రాంతంలో బయటపడింది.నల్లూరు శ్రీనివాసరావును ఇన్‌ఫార్మర్ అయినందుకే హతం చేశాం.ఇంటెలిజెన్స్ పోలీసులతో కలసి పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసీ గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను తయారు చేస్తూ, దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడం, ప్రజాసంఘాల వారిని అరెస్టులు చేయించడం చేస్తున్నాడు.

ఆదివాసీలకు చెందిన 70 ఎకరాలు అక్రమంగా లాక్కున్నాడు ఆదివాసీలకు, వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులకు ప్రతిబంధకంగా నిలవడంతో నల్లూరు శ్రీనివాసరావును ఖతం చేశాం అని రాసి ఉన్న లేఖలో రాసారు.దీంతో అతనిని మావోలు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు.